Top 10 Budget SUVs In India 2023: ఎస్‌యూవీలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. భారత మార్కెట్లో రోజురోజుకు ఎస్‌యూవీల అమ్మకాలు పెరుగుతున్నాయి. లుకింగ్, మైలేజ్, ధర కారణంగా చాలా మంది ఎస్‌యూవీలను ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. మీ బడ్జెట్ రూ. 10 లక్షలు ఉన్నా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. 10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో చాలా ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత మార్కెట్లో టాప్ 10 ఎస్‌యూవీల జాబితాను మీ కోసం సిద్ధం చేసాం. టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జాతో సహా చాలా ఎస్‌యూవీలు ఉన్నాయి. ఈ జాబితాలో మహీంద్రా థార్ కూడా ఉంది.  మహీంద్రా థార్ RWD ధర రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. 10 లక్షల రూపాయలలోపు ఉన్న టాప్ 10 ఎస్‌యూవీల జాబితాను ఇపుడు చూద్దాం. 


టాప్ 10 ఎస్‌యూవీల జాబితా:


  • Tata Punch: టాటా పంచ్ (ధర - రూ. 6 లక్షల నుండి రూ. 9.4 లక్షలు)

  • Tata Nexon: టాటా నెక్సాన్ (ధర - రూ. 7.80 లక్షల నుండి రూ. 14.35 లక్షలు)

  • Maruti Brezza: మారుతీ బ్రెజ్జా (ధర - రూ. 8.19 లక్షల నుండి రూ. 13.88 లక్షలు)

  • Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ (ధర - రూ. 7.68 లక్షల నుండి రూ. 13.11 లక్షలు)

  • Kia Sonet: కియా సోనెట్ (ధర - రూ. 7.69 లక్షల నుండి రూ. 14.39 లక్షలు) 

  • Renault Kiger: రెనాల్ట్ కిగర్ (ధర - రూ. 6.50 లక్షల నుండి రూ. 11.23 లక్షలు)

  • Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ (ధర - రూ. 5.97 లక్షల నుండి రూ. 10.94 లక్షలు)

  • Mahindra XUV300: మహీంద్రా XUV300 (ధర - రూ. 8.41 లక్షల నుండి రూ. 14.07 లక్షలు)

  • Mahindra Bolero: మహీంద్రా బొలెరో (ధర - రూ. 9.78 లక్షల నుండి రూ. 10.79 లక్షలు)

  • Mahindra Thar: మహీంద్రా థార్ (ధర - రూ. 9.99 లక్షల నుండి రూ. 16.49 లక్షలు)


పైవన్ని ఎక్స్ షోరూమ్ ధరలు అని గుర్తుంచుకోవాలి. వీటిలో మహీంద్రా బొలెరో మరియు థార్ తప్ప అన్నీ 5-సీటర్ఎస్‌యూవీలు. బొలెరో 7 సీట్ల కార్ కాగా.. థార్ 4 సీట్ల కారు. అయితే టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్ కాగా.. మిగిలిన ఎస్‌యూవీలు సబ్ 4-మీటర్ ఎస్‌యూవీలు. పంచ్ కాకుండా ఇతర అన్ని ఎస్‌యూవీల యొక్క టాప్ వేరియంట్‌ల ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. మహీంద్రా బొలెరో మరియు మహీంద్రా థార్ (ఆన్‌రోడ్) రెండింటి యొక్క బేస్ వేరియంట్‌ల ధర కూడా రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. 


Also Read: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు  


Also Read: Ram Charan Meets PM : నేటి సాయంత్రం ప్రధానిని కలవనున్న రామ్ చరణ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి