Better.com CEO Vishal Garg fires 900 employees with a Single Zoom call: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం (WFH) చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్. కరోనా తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది ఆరంభంలో ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేశాయి కొన్ని కంపెనీలు. అయితే కొత్త వేరియెంట్ 'ఒమిక్రాన్' ప్రపంచదేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం విరమించుకునే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం కంటిన్యూ చేయనున్నారు. ఇక వర్క్‌ ఫ్రమ్‌ హోం వచ్చినప్పటి నుంచి ఆఫీస్ మీటింగ్స్ కోసం పలు కంపెనీలు జూమ్‌ కాల్‌ను వినియోగిస్తున్నాయి. అయితే ఈ జూమ్‌ కాల్‌ (Zoom call)ను కేవలం మీటింగ్స్ కోసమే కాకుండా.. ఉద్యోగాలను తీసేందుకు కూడా ఉపయోగించుకున్నారు ఓ సంస్థ సీఈఓ (CEO). విషయంలోకి వెళితే....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్‌.కామ్‌ (Better.com) సీఈవో విశాల్‌ గార్గ్‌ (Vishal Garg).. గత బుధవారం (డిసెంబర్ 1) తమ ఉద్యోగులకు జూమ్‌ కాల్‌ చేశారు. విశాల్‌ చేసింది మీటింగ్‌ కోసం కాదు.. ఉద్యోగులను తొలగించేందుకు. జూమ్‌ కాల్‌లో విశాల్‌ తమ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఒకరిద్దరిని కాకుండా.. ఏకంగా 900 మంది ఉద్యోగులను తీసేసినట్టు చెప్పారు. ఇందులో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని వారు ఉన్నారు. సమర్థత, పనితీరు సరిగా లేని వారిని విశాల్‌ విధుల నుంచి తప్పించారట. బెటర్‌.కామ్‌ కంపెనీ సిబ్బంది మొత్తంలో ఇది 9 శాతం కావడం విశేషం. 


Also Read: NTR - Mahesh Babu: మహేష్ బయ్యా.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది: ఎన్టీఆర్‌


'ప్రస్తుతం కాల్‌లో ఉన్నవారు ఈ వార్త వినాలనుకోరు. దురదృష్టవశాత్తూ ఈ కాల్‌ గ్రూప్‌లో ఉన్నవారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం. ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడం నా కెరీర్‌లో ఇది రెండోసారి. గతంలో నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డా. ఒకానొక సమయంలో ఏడ్చాను కూడా. కానీ ఇప్పుడు మాత్రం బలంగా ఉండాలని ముందే నిర్ణయం తీసుకున్నా. మార్కెట్ మారిపోయింది. మనుగడ సాగించడానికి మేము దానితో పాటుగా పరుగెత్తాలి. అప్పుడే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. ఇది నిజంగా సవాలుతో కూడుకున్న నిర్ణయం. మార్కెట్‌, సమర్థత, పనితీరు తదితర కారణాలతో కంపెనీలోని 15 శాతం సిబ్బందిని తొలగిస్తున్నాం' అని విశాల్ గార్గ్‌ జూమ్‌ కాల్‌లో ఉద్యోగులకు చెప్పారు. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు కనీసం సగటున 2 గంటలు కూడా పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు.


Also Read: Ramarao on Duty: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్స్‌లోకి ఎప్పుడంటే..


ఇందుకు సంబంధించిన వీడియోను బెటర్‌.కామ్‌ (Better.com)కు చెందిన ఓ ఉద్యోగి తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ (Vishal Garg) తొలగించారట. అయితే సీఈవో చెప్పినట్లు 15శాతం సిబ్బందిని కాకుండా 9శాతం సిబ్బందిని మాత్రమే తొలగించినట్లు ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గతంలో విశాల్‌ గార్గ్‌ ఈ-మెయిల్‌ ద్వారా ఉద్యోగం తీసేస్తున్నట్టు ప్రకటించగా.. ఈసారి టెక్నాలిజీని ఉపయోగించారు. విశాల్‌పై ఉద్యోగం పోయిన ఉద్యోగులు గుర్రుగా ఉన్నారట. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook