NTR - Mahesh Babu: మహేష్ బయ్యా.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది: ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఆదివారం అతిథిగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జెమినీ టీవీ ప్రీమియర్‌గా ప్రదర్శించింది. ఈ సందర్భంగా మ‌హేష్ త‌న ముద్దుల కుమార్తె సితార‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 06:44 PM IST
  • మహేష్ బయ్యా.. మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది
  • చిన్నతనంలో వీణ బాగా వాయించేవాడిని
  • సెలవులను బాగా ఎంజాయ్ చేస్తా
NTR - Mahesh Babu: మహేష్ బయ్యా.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది: ఎన్టీఆర్‌

Jr NTR says I'm jealous on Mahesh Babu: జెమినీ టీవీలో ప్రసారమయిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' (Evaru Meelo Koteeswarulu,) షో గత కొన్ని రోజులుగా అభిమానులను అలరించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో.. తొలి సీజన్‌ ఆదివారంతో ముగిసింది. చివరి ఎపిసోడ్‌కు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) అతిథిగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జెమినీ టీవీ ప్రీమియర్‌గా ప్రదర్శించింది. ఇద్దరు స్టార్‌ హీరోలు బుల్లితెరపై కనిపించడంతో తెలుగు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మహేష్ ఈ గేమ్ షోలో కనిపించడం ఇదే తొలిసారి కాగా.. ఎన్టీఆర్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ రూ.25లక్షలు గెలుచుకున్నారు. ఇక ప్రశ్నల మధ్య మధ్యలో సూపర్‌స్టార్‌ తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలు కొన్నింటిని పంచుకున్నారు.

మ‌హేష్ బాబుని హాట్ సీట్‌పై కూర్చో బెట్టిన ఎన్టీఆర్‌.. సమయానుసందార్భంగా పలు ప్రశ్నలు అడిగారు. మీరు సెలవులను బాగా ఎంజాయ్ చేస్తారు కదా?, కరోనా భయాందోళనల మధ్య మహేష్ విహారయాత్రకు ఎలా వెళ్తాడోనని ఆందోళన చెందుతున్నా అని తారక్ అనగా.. 'నిజమే. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతాను.  పిల్లలతో ఏడాదికి మూడు వెకేషన్స్ ప్లాన్ చేస్తా. దాంతో పిల్లలు, మా మధ్య బంధం బలోపేతం అవుతుంది' అని మహేష్ చెప్పారు. సినిమాల‌తో పాటు కుటుంబంతో గడపడానికి మహేష్ ఇష్టపడుతారు.  సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా.. షూటింగ్ మధ్యలో ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తారు సూపర్‌స్టార్‌. 

Also Read: ICC Test Rankings: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి కైవసం చేసుకున్న టీమిండియా!!

మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న ముద్దుల కుమార్తె సితార‌ (Sitara)తో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పారు. సితార‌ గురించి చెప్పండి అని జూనియర్ ఎన్టీఆర్ (NTR) అడగ్గా.. 'తనతో నా అనుబంధం రోజు రోజుకీ పెరుగుతుంది. సీతారతో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. తనతో నాకు ప్రతి దశలో వేర్వేరు బంధాలు ఉన్నాయి. 1-3 సంవత్సరాలలో ఓ బంధం, 3-5లో ఇంకోలా ఉంది. ప్రతి ఏడాదికి బంధం మారుతూ ఉంటుంది. తండ్రికి అప్‌గ్రేడేషన్ అవసరం' అని ప్రిన్స్ సమాధానం ఇచ్చారు. ఇది విన్న ఎన్టీఆర్.. మహేష్ బయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందన్నారు. కూతుళ్లు ఉన్న‌వాళ్ల‌ను చూసి త‌న‌కు ఈర్ష్య‌గా అనిపిస్తుంద‌ని అన్నారు. తనకు ఇద్ద‌రూ కొడుకులే అని, కూతుళ్లు లేక‌పోవ‌డం వెలితిగా ఉందన్నారు. 

Also Read: IND vs NZ: వావ్.. భారత్-న్యూజీలాండ్ ఆటగాళ్ల పేర్లు భలే కలిసాయే! అశ్విన్ నువ్ సూపరో సూపర్!!

షో మధ్యలో సంగీతం ప్రస్తావన రావడంతో.. తాను చిన్నతనంలో వీణ బాగా వాయించేవాడినని, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడంతో  వీణ వాయించే సమయం దొరకడం లేడి మహేశ్‌ బాబు (Mahesh Babu) తెలిపారు. 'ఒక్కడు' సినిమా పాటలు అంటే తనకు చాలా ఇష్టమని.. సమయం దొరికినప్పుడల్లా ఆ పాటలను వింటూ ఎంజాయ్‌ చేస్తానని మహేష్ చెప్పారు. ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా గురించి మహేశ్‌ స్పందించారు. ఆ సినిమా పోకిరిలా ఉంటుందని, ఇందులో తన పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు చెప్పుకొచ్చారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News