PSU Stock: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ PSU స్టాక్స్ ఒక లక్షకు ..7 లక్షల లాభం ..!!
Bharat Dynamics Ltd: ఎలాంటి స్టాక్ లో మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బుకు మంచి రిటర్న్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా. అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థల పైన మీరు ఒక దృష్టి వేయవచ్చు. గడచిన ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగ సంస్థలు మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన రెండు కంపెనీల స్టాక్స్ గురించి తెలుసుకుందాం.
Bharat Dynamics Share Price : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే మీరు ఎంపిక చేసుకున్న కంపెనీల పట్ల నమ్మకం కలిగి ఉండాలి. ముఖ్యంగా మీరు ఎంపిక చేసుకున్న కంపెనీలు ఫండమెంటల్స్ పరంగాను, అదే విధంగా టెక్నికల్ పరంగాను స్ట్రాంగ్ గా ఉండాలి. దీంతో పాటు ఆ స్టాక్స్ మంచి వ్యాపారం ని ప్రదర్శిస్తుండాలి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మంచి రాబడిని అందిస్తున్నాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో మంచి పర్ఫామెన్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గడచిన ఐదు సంవత్సరాలుగా మీ స్టాక్స్ ను మల్టీబ్యాగర్ స్టాక్స్ గా మార్చాయి.
భారత్ డైనమిక్ లిమిటెడ్ స్టాక్ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం:
బీడీఎల్ (BDL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్: ప్రస్తుతం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షేర్ గురించి తెలుసుకుందాం. గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇన్వెస్టర్లకు దాదాపు 900% రాబడి 2018లో బీడీఎల్ స్టాక్ మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది. అప్పట్లో ఈ స్టాక్ ధర కేవలం 194 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 1400 రూపాయలు పైన ఉంది. ఈ ఏడాది జూలై నెలలో ఈ స్టాక్ దాదాపు 1700 రూపాయల వరకు తాకింది. అంటే ఎవరైతే 2018 వ సంవత్సరంలో ఒక షేరుకు 200 చొప్పున 500 షేర్లు కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. వారికి ప్రస్తుతం 7 లక్షల రూపాయల వరకు లభించే అవకాశం ఉంటుంది. అంటే మీ పెట్టుబడి దాదాపు 7 రెట్లు పెరిగింది అని అర్థం.
మిశ్రమ ధాతు నిగం:
ఇదే కోవలో హైదరాబాదుకు చెందిన మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రమ దాతునిగం గురించి తెలుసుకుందాం. దీనినే మిధాని అని పిలుస్తారు. ఈ షేరు 2018 వ సంవత్సరంలో కేవలం 90 రూపాయలకే లభించింది. కానీ ప్రస్తుతం ఈ స్టాక్ 440 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఈ స్టాక్ ను 90 రూపాయల చొప్పున 500 షేర్లను కేవలం 45 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు అని అర్థం. వీటి విలువ ప్రస్తుతం రూ. 2,20,000 వరకు పెరిగింది. అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది అని అర్థం.
Also Read: ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్
ఇవి రెండూ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావడం విశేషం. అందులోనూ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కేంద్ర రక్షణ శాఖకు చెందిన సంస్థ ఇక మిశ్రమ దాతునిగం కూడా కేంద్ర రక్షణ శాఖకు అనుబంధ సంస్థగా చెప్పవచ్చు ఈ రెండు సంస్థలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది అందుకే ఇన్వెస్టర్లకు ఈ రెండు సంస్థలపై ఎలాంటి డోకా లేదు అని అర్థం అయితే మీరు ఇన్వెస్ట్ చేసేముందు వీటికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను అదేవిధంగా మార్కెట్లో ఈ స్టాక్ టెక్నికల్ ఫండమెంటల్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Also Read: Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter