ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్

ITR Filing 2024: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసింది. జూలై 31 నిన్నటితో గడువు ముగియగా అత్యధికంగా 7 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. ఐటీ రిటర్న్స్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2024, 06:55 AM IST
ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్

ITR Filing 2024: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు ముగిసింది. ట్యాక్స్ పేయర్లలో అవగాహన లేదా చైతన్యం కారణంగా అత్యధికంగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 50 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయి. మరో వైపు 7 కోట్ల మైలురాయిని చేరినందుకు ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను శాఖ ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది.

ఇన్ కంటాక్స్ రిటర్న్స్ గడువు నిన్న జూలై 31తో ముగిసింది. ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియపై ఈసారి ఆదాయపు పన్ను శాఖ పదే పదే చేసిన విజ్ఞప్తుల కారణంగా ట్యాక్స్ పేయర్లు స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా రిటర్న్స్ దాఖలయ్యాయి. ఈ ఏడాది నిన్న అంటే జూలై 31 వరకూ ఐటీ రిట్నర్స్ దాఖలు చేసినవారి సంఖ్య 7 కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 50 లక్షలకు పైగా ట్యాక్స్ పేయర్లు రిటర్న్స్ ఫైల్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి అంటే జూలై 31 నాటికి 6.77 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. ఈసారి అంతకంటే ఎక్కువగా 7 కోట్లు దాటేసింది. ఏ విధమైన జరిమానా లేకుండా గడువు జూలై 31తో ముగిసింది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ జరిమానాతో గడువు మిగిలుంది. అయితే ఇన్ కంటాక్స్ పరిధిని బట్టి 1000 రూపాయల నుంచి 5 వేల వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

7 కోట్ల మైలు రాయిని చేరడంలో సహకరించినందుకు ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ పేయర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్ట్ షేర్ చేసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ప్రక్రియ ఇది. ఇప్పటికీ ఇంకా చాలామంది రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. కనీస జరిమానాతో డిసెంబర్ 31 వరకూ ఫైల్ చేయవచ్చు. లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Lung Cancer Reasons: సిగరెట్ స్మోకింగ్, కాలుష్యం మాత్రమే కాదు ఈ 5 కూడా లంగ్ కేన్సర్‌కు కారణాలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News