Big Billion Day 2022: ఈ కామర్స్ ది గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు వస్తువులను డిస్కౌంట్లతో విక్రయించేందుకు ప్రత్యేక సేల్స్ ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఫ్లిప్కార్ట్  బిగ్ బిలియన్ డేస్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. ప్రస్తుతం టీవీలో పై 20 నుంచి 30 శాతం వరకు భారీ డిస్కౌంట్తో తక్కువ ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ కార్డతో కొనుగోలు చేస్తే అదనంగా 10% డిస్కౌంట్ లభించనంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పెషల్‌ ఆఫర్‌:


ప్రస్తుతం టీవీలపై ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. అయితే మోటరోలా రేవో(MOTOROLA Revou 2) టీవీపై ప్రత్యేకమైన డిస్కౌంట్తో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్. ఈ టీవీ ప్రస్తుతం మూడు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేశారు. ముఖ్యంగా 43 ఇంచుల టీవి రూ. 39,000 కాగా అన్ని డిస్కౌంట్ పోను రూ. 35,100 లకి ఫ్లిప్కార్ట్ లో విక్రయిస్తుంది. అయితే ఈ టీవీని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ తో దాదాపు రూ. 1750 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ల విషయానికొస్తే.. టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీ కండిషన్ ని బట్టి రూ 11,000 దాకా తగ్గింపుపొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు అన్ని పోను కేవలం రూ. 22,600కే మీరు ఈ టీవిని కొనుగోలు చేయోచ్చు. ఈ టీవి ఆండ్రాయిడ్ 11 పై నడుస్తుంది. ఫోన్‌లో ఉండే ప్రతి ఫీచర్‌ ఇందులో ఉంటుంది.


ఇక వినియోగదారుల ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే.. డిస్ప్లే పై 4.1 రేటింగ్ ని ఇచ్చారు. ఈటీవీ యు హెచ్ డి(UHD) డిస్ప్లే పై పని చేయడంతో మంచి క్లారిటీతో అవుట్పుట్ ని అందిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే ఇందులో డాల్బీ అట్మోస్-సపోర్టెడ్ 24W స్పీకర్స్‌ టెక్నాలజీని వినియోగించారు. థియేటర్లో వచ్చే సౌండ్ అనుభూతిని ఈ టీవీ ద్వారా పొందవచ్చు. సౌండ్ పరంగా వినియోగదారులు 3.9 రేటింగ్ ఇచ్చారు.


స్పెషల్‌ ఫీచర్లు:
>>అల్ట్రా HD డిస్ప్లే
>>డాల్బీ విజన్
>>లాగ్-ఫ్రీ, స్మూత్ గేమింగ్
>>ఆటో లో లేటెన్సీ మోడ్
>>మోషన్ ఎస్టిమేషన్ టెక్నాలజీ
>>7,000పైగా యాప్‌లను వినియోగించవచ్చు
>>ఫాస్ట్ బూట్
>> క్వాడ్-కోర్ MediaTek CPU
>>మెమరీ-సెంట్రిక్ ఆపరేషన్‌
>>2GB ఆన్‌బోర్డ్ ర్యామ్‌
>>Wi-Fi సపోర్ట్
>>డాల్బీ అట్మోస్-సపోర్టెడ్ 24W స్పీకర్స్‌
>>ఐ సేఫ్ మోడ్‌
>>బ్లూ లైట్ ఫీచర్


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok