Jio Hikes Tariff: వినియోగదారులకు జియో నెట్‌వర్క్‌ భారీ షాక్‌ ఇచ్చింది. గతంలో ఉన్న రీచార్జ్‌ చార్జీలను ఊహించని రీతిలో పెంచేసింది. ప్రీ పెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. కనిష్ట ప్లాన్‌ నుంచి వార్షిక ప్లాన్‌ వరకు అన్నింటి ధరలు పెంచేసింది. దీంతో జియో నెట్‌వర్క్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరల ప్రకారం.. వినియోగదారులపై దాదాపు రూ.600 వరకు అదనపు భారం పడుతుండడం గమనార్హం. అయితే పెంచిన ధరలు జూలై 3వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవే


 


  • గతంలో 28 రోజుల ప్లాన్‌కు 2 జీబీ డేటా కోసం రూ.155 ఉండేది. ఇప్పుడు ఆ ప్లాన్‌ ధర రూ.189కి పెరిగింది.

  • 28 రోజుల వ్యవధిలో రోజుకు ఒక జీబీ ప్లాన్‌ రూ.209 నుంచి రూ.249కి పెరిగింది.

  • 28 రోజుల వ్యవధిలో 1.5 జీబీ ప్లాన్‌ రూ.239 నుంచి రూ.299కి పెంచేసింది.

  • 28 రోజుల వ్యవధిలో 2 జీబీ ప్లాన్‌ రూ.299 నుంచి రూ.349కి పెంచేసింది.


Also Read: Maruti Ispat and Pipes: రూ.2 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం.. MS వాయు పేరిట వినూత్న ఉత్పత్తులు
జియో 2 నెలల ప్లాన్‌


  • రోజుకు రూ.479 ఉండే 1.5 జీబీ ప్లాన్‌ ధరను భారీగా పెంచేయడంతో ఇప్పుడు ఈ ప్లాన్‌ ధర రూ.579కి చేరింది.

  • రోజుకు 2 జీబీ ప్లాన్‌ ధరను రూ.629కి పెంచేసింది.

  • అదనంగా మూడు నెలల 6 జీబీ డేటా ప్లాన్‌ను రూ.395 నుంచి రూ.479కి పెంచింది.


వార్షిక ప్లాన్లు


  • 336 రోజులు 24 జీబీ డేటా ప్లాన్‌ రూ.1599 నుంచి రూ.1,899కి పెరిగింది.

  • రోజుకు 2.5 జీబీ ప్లాన్‌ 365 రోజుల ప్లాన్‌ ధర రూ.2,999 నుంచి రూ.3,599కి పెంచింది.


కాగా దేశంలోనే అత్యధికంగా జియో నెట్‌వర్క్‌ వినియోగదారులు ఉన్నాయి. భారీగా ధరలు పెంచేయడంతో నెట్‌వర్క్‌ వదిలేసుకోవడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు. 12.5 శాతం నుంచి 25  శాతం వరకు ధరలు పెంచడంతో నెట్‌వర్కింగ్‌ రంగం కూడా షాక్‌కు గురయింది. కాగా అంబానీ తన కొడుకు పెళ్లి వేళ వినియోగదారులకు మంచి కానుక అందించారని వినియోగదారులు ఎద్దేవా చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి