Blue Screen Of Death: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సమస్య తలెత్తడంతో ప్రపంచం కుదేలైంది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో బ్యాంకింగ్‌, విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ప్రభావానికి గురయ్యాయి. పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు భారత్‌లో ఆయా విమాన సంస్థ తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. అకస్మాత్తుగా విమానాలు రద్దవడం.. ఆలస్యంగా బయల్దేరడం వంటి వాటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా


మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో బ్లూ స్క్రీన్‌ ఎరర్‌పై తలెత్తిన సమస్యపై మైక్రోసాఫ్ట్ సంస్థ దర్యాప్తు చేపట్టింది. విండోస్‌ 11, 10లో క్లౌడ్‌ సర్వీస్‌ ద్వారా నడుస్తున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సమస్య ఏర్పడింది. వెంటనే సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సమస్య తలెత్తడంతో కంప్యూటర్‌ వినియోగంతో జరిగే ఆన్‌లైన్‌ సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ఆన్‌లైన్ సేవలు, టికెట్ బుకింగ్‌పై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా మీడియా, విమాన, టెలికాం, బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమస్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. లండన్ స్టాక్‌ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం కలిగింది.

Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం


బ్లూ స్క్రీన్‌ పలుమార్లు రీస్టార్ట్‌ అవుతున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు. ఈ సమస్యపై వెంటనే భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ స్పందించి మైక్రోసాఫ్ట్‌ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి కొత్త అప్‌డేట్లు విడుదల చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలిపింది. అప్‌డేట్ల ద్వారా సిస్టమ్‌లు వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు.


శంషాబాద్, గన్నవరంలో పలు సేవలు రద్దు
తెలంగాణలోని శంషాబాద్‌ విమానాశ్రయం తీవ్రంగా ప్రభావితమైంది. రాజీవ్‌ గాంధీ అంర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన చాలా విమానాలు రద్దయ్యాయి. పలు అంతర్జాతీయ విమానాలతో పాటు జాతీయ విమానాలను అధికారులు రద్దు చేశారు. స్పైస్ జెట్, ఆకాష్ వంటి ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానాలు రద్దయ్యాయి. కృష్ణాజిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీస్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటివరకు 7 విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం  నుంచి ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు మాన్యువల్‌గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు. ప్రయాణికులకు టికెట్లు నిలిపివేశారు.


శంషాబాద్‌ నుంచి రద్దయిన విమానాలు ఇవే..
6E 6646 HYD-CJB 
Dep : 17:30
6E 2486 HYD - TIR
Dep : 18:10
6E 695 HYD-COK 
Dep : 23:00
6E 6591 TIR-HYD 
Arr: 20:45
6E 764 CJB-HYD 
Arr: 21:25
6E 742 COK-HYD 
Arr: 22:20
6E 7248 HYD-RPR STD:1755
6E 6638 HYD-JAI STD: 2015
6E 5381 HYD-TRV STD: 2010
6E 621 HYD-IDR STD: 2005
6E 384 HYD-VTZ STD: 2200
6E 6727 HYD-AMD STD: 1750
6E 6417 HYD-BLR STD: 1750
 6E 6505 HYD-BLR STD: 2245
6E922 HYD-BBI STD: 2050
6E 816 JAI-HYD STA: 2200
6E 335 TRV-HYD STA: 2355
6E 7249 RPR-HYD STA: 2240
6E 631 BBI-HYD STA: 0025(20th JULY)
6E 385 VTZ-HYD STA: 0050(20th JULY)
6E 855 BLR-HYD STA: 2050
6E 6728 AMD-HYD STA: 2145
6E 883 VTZ-HYD STA: 2200
6E 7241 IXE - HYD
6E 638 BLR- HYD
6E 5056 BOM - HYD
6E 7103 HYD - IXE
6E 285  HYD - BLR
6E 5195 HYD - BOM







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter