Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా

GT World Mall Security Staff Denied Entry To Farmer: మరో వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఒక కమర్షియల్‌ మాల్‌లో లుంగీ కట్టిన రైతులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 17, 2024, 04:29 PM IST
Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా

GT World Mall: కర్ణాటకలో వరుసగా రైతులకు అవమానకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల కిందట మెట్రో రైలులో రైతులను అనుమతించని సంఘటన మరువకముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. లుంగీ కట్టుకుని వచ్చిన రైతులను ఓ కమర్షియల్‌ మాల్‌ సిబ్బంది అనుమతించలేదు. మీరు లుంగీ కట్టుకుని వచ్చిన కారణంగా మిమ్మల్ని అనుమతించమని తేల్చి చెప్పారు. ఈ సంఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సంఘటనపై మరుసటి రోజు ఆ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని మగాడి రోడ్డులో జీటీ మాల్‌ అని ఉంది. షాపింగ్‌, వినోదం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఈ మాల్‌ను సందర్శిస్తుంటారు. ఈ మాల్‌లో సినిమా చూసేందుకు హవేరి జిల్లా అరెమల్లాపుర గ్రామానికి చెందిన యువకుడు నాగరాజ్‌ తన తండ్రి ఫకీరప్పతో మంగళవారం (జూలై 16) వచ్చాడు. అయితే రైతుగా ఉన్న తండ్రి లుంగీ కట్టుకుని వచ్చారు. లుంగీ ధరించి వచ్చిన రైతులను అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. 'మీకు ప్రవేశం లేదు' అని సిబ్బంది చెప్పడంతో అతడి కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం

'ఎందుకు అనుమతి ఇవ్వరు' అని సిబ్బందితో రైతు కుమారుడు వాగ్వాదానికి దిగాడు. 'నువ్వు ప్యాంట్‌ వేసుకుని వచ్చావు. నువ్వు లోపలికి వెళ్లు. కానీ మీ నాన్నకు అనుమతి లేదు' అని చెప్పడంతో సిబ్బందితో కుమారుడు గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సిబ్బంది రెచ్చిపోయి కుమారుడిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడికి నిరసనగా మాల్‌ ముందు నాగరాజ్‌ ధర్నాకు దిగాడు.

ఈ సంఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. నాగరాజ్‌, అతడి తండ్రికి జరిగిన సంఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో కూడా మాల్‌ నిర్వాహకులపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై రైతు సంఘాలు నిరసనకు దిగాయి. బుధవారం జీటీ మాల్‌ ముందు ధర్నాకు దిగారు. రైతులంతా లుంగీలు ధరించి మాల్‌లోకి వచ్చారు. సంప్రదాయ వస్త్రాలు ధరిస్తే ఎలా అనుమతించరని? ప్రశ్నించారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు
వెంటనే మాల్‌ నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని అక్కడి రైతు సంఘం నాయకుడు కురుబురు శాంతకుమార్‌ డిమాండ్‌ చేశారు. వెంటనే బాధిత తండ్రి కుమారులకు పరిహారం చెల్లించాలని కోరారు. కాగా కర్ణాటకలో వస్త్రధారణపై తరచూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ రైతును ఇదే కారణంతో మెట్రో రైలు ప్రయాణానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఆ సంఘటన కూడా అక్కడ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x