Investors lose: స్టాక్ మార్కెట్లు సోమవారం అత్యంత భారీ నష్టాలను నమోదు చేశాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత 10 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా సూచీలు నష్టాలను చవి చూశాయి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఎస్​ఈ-సెన్సెక్స్ 1,747 పాయింట్లు (3 శాతం) కోల్పోయి.. 56,405 వద్దకు చేరింది. ఎన్ఎస్​ఈ నిఫ్టీ 53.95 పాయింట్ల నష్టంతో 16,842 వద్ద స్థిరపడింది.


మార్కెట్ల నష్టాలకు కారణాలు..


రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాలు యుద్ధం చేయొచ్చని అంచనాలు కూడా వస్తున్నాయి.


ఈ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. మదుపరులు ఆధ్యాంతం అమ్మకాలపైనే దృష్టి సారించారు. ఆరంభం నుంచి ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు.


మదుపరుల ఒక్క రోజు నష్టం ఎంతంటే..


స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో నష్టపోవడంతో.. బీఎస్​ఈ లిస్టెండ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన మదుపరుల సంపద రూ.8.5 లక్షల కోట్లు ఆవిరైంది. అన్ని రంగాల్లోనూ మదుపరులు నష్టాలను చవి చూశారు.


బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్​) ఒక్క రోజులోనే రూ.263.89 కోట్ల నుంచి రూ.255.38 కోట్లకు పడిపోయింది.


అత్యధిక ఎం-క్యాప్ కలిగిన కంపెనీలు ఇవే..


బీఎస్​ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.15,82,135 కోట్ల మార్కెట్​ క్యాపిటల్​తో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా ఉంది. సోమవారం సెషన్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేరు 1.60 శాతం నష్టపోయింది. ప్రస్తుతం కంపెనీ షేరి విలువ రూర.2,338.80 వద్ద ఉంది.


ఇక ఎం-క్యాప్ పరంగా టెక్​ దిగ్గజం టీసీఎస్​ రెండో స్థానంలో ఉంది. బీఎస్​ఈ ప్రకారం టీసీఎస్​ మార్కెట్ క్యాపిటల్​ రూ.13,81,318 కోట్లు. ఇక సోమవారం సెషన్​లో లాభాన్ని (బీఎస్​ఈలో) గడించిన ఏకైక కంపెనీ టీసీఎస్ కావడం విశేషం. నేటి సెషన్​లో సంస్థ షేర్లు 1.05 శాతం లాభాన్ని నమోదు చేశాయి. ప్రస్తుతం టీసీఎస్ షేరు ధర రూ.3,734 వద్ద ఉంది.


Also read: Stock Market today: మార్కెట్లను బెంబేలెత్తించిన బేర్​- రికార్డు స్థాయిలో నష్టాలు..


Also read: Fuel price hike: త్వరలో మళ్లీ పెట్రోల్​, డీజిల్ ధరల బాదుడు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook