Stock Market today: స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించిన బేర్​- రికార్డు స్థాయిలో నష్టాలు..

స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆందోళనలతో ఇటీవలి కాలంలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 02:51 PM IST
  • స్టాక్ మార్కెట్లకు రికార్డు స్థాయి నష్టాలు
  • కుప్ప కూలిన లోహ, బ్యాంకింగ్ రంగాలు
  • అంతర్జాతీయ ప్రతికూలతలే కారణం
Stock Market today: స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించిన బేర్​- రికార్డు స్థాయిలో నష్టాలు..

Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆందోళనలతో ఇటీవలి కాలంలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1747 పాయింట్లు కోల్పోయి 56,405 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ-నిఫ్టీ 531 పాయింట్లు పడిపోయి 16,842 వద్ద స్థిరపడింది.

అన్ని రంగాలు నష్టాలను నమోదు చేశాయి. లోహ, బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.

ఈ స్థాయిలో నష్టాలు ఎందుకంటే..

ఉక్రెయిన్-రష్యాల మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా తారా స్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య యుధ్ద వాతావరణం నెలకొంది. ఈ భయాలతో అటు అంతర్జాతీయంగాను దాదాపు అన్ని మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. దీనితో ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడిందని విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,191 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇక ఒకానొక దశలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో 56,295 స్థాయికి పడిపోయింది.

నిఫ్టీ కూడా 17,099 అత్యధిక స్థాయిని తాకగా.. ఓ దశలో 16,861 వద్దకు చేరింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

30 షెర్ల ఇండెక్స్​లో కేవలం టీసీఎస్ మాత్రమే 0.93 శాతం లాభాన్ని నమోదు చేసింది. మిగతా 29 కంపెనీలు నష్టపోయాయి.

టాటా స్టీల్​ అత్యధికంగా 5.80 శాతం నష్టాన్ని నమోదు చేసింది. హెచ్​డీఎఫ్ 5.58 శాతం, ఎస్​బీఐ 5.51 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.94 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.67 శాతం నష్టాన్ను మూటగట్టుకున్నాయి.

Also read: Fuel price hike: త్వరలో మళ్లీ పెట్రోల్​, డీజిల్ ధరల బాదుడు?

Aslo read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News