BSNL Cheapest Plan: దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో రిలయన్స్ జియా, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ముందు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలకు పోటీగా ప్రభుత్వం టెలికాం కంపెనీ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ముందుకు వస్తుంది. ప్రముఖ సంస్థలైన జియా, ఎయిర్ టెల్ లకు గట్టి పోటీని చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్


భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 106 ప్లాన్ తో 100 నిమిషాల ఉచిత కాలింగ్ తో పాటు 3 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్  ఉచితంగా అందించనున్నారు.  ఈ ఉచిత నిమిషాల టాక్ టైమ్ ను లోకల్ తో పాటు STD కాల్స్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. 


అయితే ఈ ప్లాన్ ద్వారా SMS ప్రయోజనాలు రావు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో 60 రోజుల బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక రింగ్ బ్యాక్ టూన్ సదుపాయం ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ లో అతి తక్కువ ధర కలిగిన రూ. 106 రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.  


హైస్పీడ్ ఇంటర్నెట్ తో..


టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) 2021 డిసెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరోవైపు గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 4G సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. ఇంటర్నెట్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా లక్ష టవర్లకు పైగా ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. 


ALso Read: Bank holidays 2022 March: మార్చిలో 13 రోజులు బ్యాంక్​ సెలవులు- మరిన్ని వివరాలు ఇలా..


ALso Read: Realme Narzo 50: రియల్‌మి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook