Realme Narzo 50: రియల్‌మి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే

Realme Narzo 50 Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రియల్ మీ.. భారత విపణిలో మరో రెండు కొత్త వేరియంట్స్ ను గురువారం (ఫిబ్రవరి 24) ప్రవేశపెట్టింది. Realme Narzo 50 పేరిట మార్కెట్లోకి రానున్న రెండు వేరియంట్స్ ను స్టోరేజ్ కెపాసిటీని బట్టి.. వరుసగా రూ. 12,999, రూ. 15,499 గా వాటి ధరలను నిర్ణయించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 04:43 PM IST
Realme Narzo 50: రియల్‌మి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే

Realme Narzo 50 Launch: Realme స్మార్ట్ ఫోన్ కంపెనీ నుంచి Narzo 50 వేరియంట్ గురువారం (ఫిబ్రవరి 24) భారత విపణిలోకి ప్రవేశించింది. వర్చువల్ గా ఈ స్మార్ట్ ఫోన్ ను సదరు కంపెనీ భారత్ లోకి విడుదల చేసింది. Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది Realme Narzo 50i, Narzo 50A సిరీస్ లో కొనసాగింపుగా వస్తున్న మూడో స్మార్ట్ ఫోన్. 

భారతదేశంలో Realme Narzo 50 ధర

Realme Narzo 50 రెండు వేరియంట్ల రూపంలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ 4GB RAM + 64GB స్టోరేజ్‌ తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 12,999గా నిర్ణయించారు. మరోవైపు టాప్-ఎండ్ మోడల్ 6GB RAM + 128GB స్టోరేజ్‌ తో మార్కెట్లోకి ప్రవేశించిన మొబైల్ ధర రూ. 15,499గా ఉంది. రియల్ మీ నార్జో 50 వేరియంట్స్ స్పీడ్ బ్లాక్, స్పీడ్ బ్లూ వంటి రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. 

ఆన్ లైన్ విక్రయ వివరాలు

Realme Narzo 50 వేరియంట్స్ ను అమెజాన్ ఈ - కామర్స్ వెబ్ సైట్ లో లేదా రియల్ మీ వెబ్ సైట్ లో మార్చి 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి ఉంచనున్నారు. 

రియల్ మీ నార్జో 50 స్పెసిఫికేషన్స్

1) డిస్ ప్లే - 6.6 అంగుళాల డిస్ ప్లే

2) రిఫ్రెష్ రేట్ - 120Hz 

3) కెమెరా - 50 మెగా పిక్సెల్స్

4) సెల్ఫీ కెమెరా  - 16 మెగా పిక్సెల్స్ 

5) ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 11 

6) బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh. 

Also Read: Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.49 లకే శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ కొనేయండి!

Also Read: Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.764 ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News