BSNL Direct To Device: దిగ్గజ మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఊహించని దెబ్బ తీసింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌ చేసుకునేలా పరిజ్ఞానాన్ని త్వరలో తీసుకురానుంది. అంతేకాకుండా మొబైల్‌ టవర్‌ లేకుండానే టెలికామ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దీంతో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలకు మాస్టర్‌ స్ట్రోక్‌ తగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకువస్తున్న కొత్త విధానం ఏమిటి? సిమ్‌ లేకుండా ఫోన్‌ కాల్స్‌ ఎలా అనేది తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బొనాంజా..ఏ ఉద్యోగికి ఎంత పెరిగిందో తెలుసుకోండి..?


 


ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సాంకేతికతపై  ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సాంకేతికత ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుండడం విశేషం. అంతేకాదు స్మార్ట్ వాచ్‌తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ సాంకేతికత తీసుకురావడం వెనుక గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Real Estate in Hyderabad: హైదారాబాద్ లో చుక్కలను తాకిన ఇండ్ల ధరలు..వామ్మో ఇదెక్కడి ధరలు రా బాబు.. ఊరికి పారిపోవాల్సిందే


ఏమిటి డైరెక్ట్ టు డివైజ్?
సాంకేతికతను వినియోగించుకుని సిమ్‌కార్డు లేకుండానే ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కార్ల యజమానులు శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. వ్యక్తిగత, డివైజ్ కమ్యూనికేషన్‌కు అనుసంధానం చేసేలా డిజైన్ చేశారు. మన లొకేషన్‌తో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. వినియోగదారులకు విస్తృతంగా కవరేజీ ఇవ్వడంతోపాటు నమ్మదగిన కమ్యూనికేషన్ చేరవేస్తుంది.


టవర్లు మూత
శాటిలైట్ కమ్యూనికేషన్‌లో భాగమైన డైరెక్ట్ టు డివైజ్ సేవల్లో ఊరూరా ఉండే మొబైల్ టవర్లతో ఇక పని ఉండదు. టవర్లతో ఏర్పడే ఇబ్బందులు ఇకపై ఉండవు. శాటిలైట్ ఫోన్లలా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం పని చేయనుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లను నేరుగా ఈ సాంకేతిక సహాయంతో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ట్రయల్స్‌ పూర్తి చేశారని సమాచారం. ట్రయల్స్‌లో 36 వేల కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని ఉపయోగించి విజయవంతంగా ఫోన్ కాల్ చేశారని తెలుస్తోంది. ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని చర్చ నడుస్తోంది. అన్ని విజయవంతమైతే త్వరలోనే సిమ్‌ కార్డు లేని.. మొబైల్‌ టవర్‌ అవసరం లేని టెలికాం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సాంకేతికత ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రామీణ సేవలు మెరుగవుతాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.