BSNL Recharge: దేశంలోని ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL). ఈ నెట్ వర్క్ కు యూజర్లు ఎక్కువగా లేకపోయినా.. ప్రస్తుత మార్కెట్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన టెలికాం సంస్థలకు గట్టిపోటీని ఇస్తుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటివి సరికొత్త ప్లాన్స్ అమలు చేస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ కూడా ఉత్తమ రీఛార్జ్ ప్లాన్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ అందించలేని తక్కువ ధరలోనే 110 రోజుల వ్యాలిడిటీతో ఉన్న బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL ఉత్తమ ప్లాన్


BSNL ఉత్తమ ప్లాన్ ధర రూ. 666. ఈ ప్లాన్‌లో మీకు 110 రోజుల పాటు రోజుకు 2GB డేటాను వినియోగించవచ్చు. అంటే మొత్తంగా ఈ ప్లాన్‌లో మీకు 220 GB ఇంటర్నెట్ వస్తుంది. ఒకవేళ మీ రోజువారీ డేటా లిమిట్ పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌ ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా ఉచిత కాలర్ ట్యూన్స్, లోక్ ధున్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. 


జియో రూ.666 ప్లాన్


రిలయన్స్ జియో (JIO)కు సంబంధించిన రూ.666 ప్లాన్ కేవలం 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే బీఎస్ఎన్ఎల్ తో పోలిస్తే.. 26 రోజులు తక్కువ. ఈ జియా ప్లాన్ ద్వారా మీరు రోజుకు 1.5 GB డేటాను పొందుతారు. అంటే రూ. 666 జియో రీఛార్జ్ పై 84 రోజుల వ్యాలిడిటీతో 126 GB లభిస్తుంది. అంటే BSNL తో పోలిస్తే 94 GB తక్కువగా వస్తుంది. అయితే ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు జియో యాప్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. 


ఎయిర్‌టెల్ రూ.666 ప్లాన్


ఎయిర్‌టెల్ (AIrtel)కు సంబంధించిన రూ. 666 రీఛార్జ్ ప్లాన్ కేవలం 77 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో రోజుకు 1.5 GB డేటా.. అంటే ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 115.5 GB డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు వస్తాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియాలోనూ ఇవే ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 


టెలికాం సంస్థ రీఛార్జ్ ప్లాన్  వ్యాలిడిటీ   డేటా(Per Day)        కాల్స్  SMS (Per Day)     ఇతర సబ్ స్క్రిప్షన్స్
బీఎస్ఎన్ఎల్ (BSNL)   రూ.666     110 రోజులు     2 GB    అన్ లిమిడెట్  100 SMSలు  కాలర్ ట్యూన్స్, లోక్ ధున్ కంటెంట్ 
జియో (JIO)  రూ.666      84 రోజులు   1.5 GB  అన్ లిమిటెడ్   100 SMSలు జియో యాప్స్
ఎయిర్ టెల్ (Airtel) రూ.666     77 రోజులు   1.5 GB అన్ లిమిటెడ్  100 SMSలు        -

Also Read: Petrol Diesel Price Today: వాహనదారులకు గుడ్ న్యూస్- పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట!


Also Read: What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook