What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు

What is TATA NEU: అమెజాన్, ప్లిప్​కార్ట్, గూగుల్​పే, ఫోన్​పే, జియో మార్ట్ వంటి దిగ్గజ యాప్స్​కు గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా గ్రూప్ సిద్దమైంది. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా.. టాటా న్యూ యాప్​ను విడుదల చేసింది. ఈ కొత్త యాప్​కు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 07:59 PM IST
  • టాటా నుంచి సరికొత్త యాప్​
  • టాటా న్యూ పేరుతో అందుబాటులోకి..
  • అన్ని అవసరాలకు ఒకే వేదిక!
What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు

What is TATA NEU: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్​ మార్కెట్లోకి సరికొత్త యాప్​ను ఆవిష్కరించింది. యూపీఐ పేమెంట్స్​, షాపింగ్​, గ్రోసరీ, హోటల్స్​, ఫ్లైట్ బుకింగ్స్​ సహా అన్ని అవసరాలను ఓకే వేదికగా తీర్చుకునేందుకు వీలుగా ఈ మొబైల్ యాప్​ను తీసుకొచ్చింది టాటా.

ముందుగా టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్​.. ఇకపై అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ యాప్​ను తొలిసారి పబ్లిక్​గా ప్రమోట్​ చేస్తోంది టాటా గ్రూప్​. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్​ లీగ్ టైటిల్ టాటా గ్రూప్ ఉన్న విషయం తెలిసిందే.

ఏమిటి ఈ టాటా న్యూ యాప్​..?

ప్రస్తుతం మార్కెట్లో షాపింగ్​ కోసం, గ్రోసరీ కోసం, టికెట్ బుకింగ్స్​ కోసం, హోటల్స్​ కోసం రకరకాల యాప్​లు అందుబాటులో ఉన్నాయి. టాటా న్యూ యాప్​లో ఆ అవసరాన్నింటికి ఏకైక వేదికగా నిలవనుంది. దీనితో రకరకాల యాప్​లను డౌన్​లోడ్​ చేసుకోవడం వల్ల ఏర్పడే స్టోరేజ్​ సహా ఆపరేటింగ్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

వాటిపై భారీ ఆఫర్లు..

టాటా న్యూ యాప్​ ద్వారా.. టాటా గ్రూప్​నకు చెందిన క్రోమా, విస్తారా, ఎయిర్ ఏషియా, ఎయిర్​ ఇండియా, వెస్ట్​సైడ్​, క్లిక్​ వంటి వాటి ద్వారా ఎలక్ట్రానిక్స్​, దుస్తులు, విమాన టికెట్లు, మెడిసిల్స్​ సహా ఇతర కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు.

కచ్చితమైన రివార్డ్​..

టాటా న్యూ యాప్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీకి కచ్చితమైన రివార్డ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత పేమెంట్​ యాప్​లను చూస్తే... బెటర్​ లక్​ నెక్ట్స్​ టైమ్ వంటి సాకులు లేకండానే కచ్చితంగా రివార్డ్స్ ఉంటాయని వివరించింది.

పేమెంట్స్​ అన్నింటికీ..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేటీఎం, గూగుల్​పే, ఫోన్​పే వంటి వాటి మాదిరిగానే.. కిరాణా స్టోర్లు మొదలుకుని, స్టార్ హోటళ్లు, సూపర్​ మార్కెట్లలో కూడా టాటా న్యూ యాప్​ ద్వారా పేమెంట్స్​ చేయొచ్చట.

చివరగా..

టాటా న్యూ ఒక్క యాప్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఈ-కామర్స్​ దిగ్గజాలతో పాటు.. జియో మార్ట్​ వంటి గ్రోసరీ, పేటీఎం, గూగుల్​పే, ఫోన్​పే వంటి పేమెంట్స్ యాప్​లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనాలు వస్తున్నాయి.

Also read: Realme GT 2 Pro: మార్కెట్లోకి రియల్​మీ జీటీ 2 ప్రో- ఫీచర్లతో పాటు ఆఫర్లూ అదుర్స్​

Also read: Zuck Bucks: మెటా నుంచి డిజిటల్​ కరెన్సీ.. 'జుక్​ బక్స్' పేరుతో..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News