BSNL Recharge Offers: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఇతర టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌కు దీటుగా సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. తమ వినియోగదారులను నిలుపుకునేందుకు చౌకైన ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఒక రోజు వ్యాలిడిటీ నుంచి 365 రోజుల వ్యాలిడిటీ వరకు అనేక రకాలను ప్లాన్‌లను కస్టమర్లకు పరిచయం చేస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.18 డేటా ప్లాన్ ఇలా..


18 రూపాయలతో డేటా ప్లాన్‌ను తీసుకువచ్చింది. రోజువారీ డేటా లిమిట్ అయిపోయినప్పుడు.. తక్కువ డేటాలో రీఛార్జ్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రూ.18 తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా వస్తుంది. ఇది రెండు రోజుల వ్యాలిటిడీటీతో 2 జీబీ డేటా వస్తుంది. డేటా లిమిట్ తగ్గితే.. డేటా వేగం కూడా తగ్గిపోతుంది. డేటా వేగం 40 Kbpsకి తగ్గుతుంది.


రూ.99 ప్లాన్ ఇలా..


బీఎస్‌ఎన్‌ఎల్ రూ.99 ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది. ప్లాన్‌లో ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి డేటా అందుబాటులో ఉండదు. కేవలం కాలింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. 18 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎస్‌ఎంఎస్ సౌకర్యం ఉండదు. 


రూ.118 ప్లాన్ వివరాలు


బీఎస్‌ఎన్‌ఎల్ 118 రూపాయలతో 20 రోజుల చెల్లుబాటుతో తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజూ 0.5 డేటా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో పీఆర్‌బీటీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. తక్కువ డేటా.. ఎక్కువ కాల్స్ చేసుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోకరంగా ఉంటుంది.


Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!  


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి