BSNL Rs 398 STV Plan Launched: Check Validity and Plan Details: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.398 డేటా వోచర్ ప్లాన్‌ను నెల రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్ మరియు నేషనల్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో Rs 398 STV ప్లాన్ అందుబాటులోకి తెచ్చారు. చెన్నై, హర్యానాలో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని సర్కిల్స్‌కు అందుబాటులోకి తేనుంది. మరో ప్లాన్ రూ.365తో ఏడాది వ్యాలిడిటీ అందిస్తుంది. BSNL ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్ అందిస్తుంది. మొదటి 60 రోజులు ప్రతిరోజూ 250 నిమిషాలు వాయిస్ కాల్స్, ఆ నిమిషాలు పూర్తయితే సాధారణ బేస్ ప్లాన్ నగదు ప్రతి కాల్‌కు ఛార్జ్ చేస్తారు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.


Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు



ఈ ప్లాన్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), అస్సాం, బిహార్, ఝార్ఖండ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, చెన్నై, యూపీ ఈస్ట్, యూపీ పశ్చిమ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అందుబాటులో ఉంది.


Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి



మరోవైపు బీఎస్ఎన్ఎల్ ఘర్ వాపసీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.399కి తీసుకొచ్చింది. ప్రతినెలా తన వినియోగదారులకు 70 జీబీ డేటా లభిస్తుంది. రూ.525తో మరో పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తెచ్చింది. వినియోగదారులకు 85 జీబీ డేటా అందిస్తుంది.  


Also Read: Air India: హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook