Air India: హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం..

A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 14, 2021, 01:47 PM IST
  • హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు
  • నేటి నుంచి హైదరాబాద్ నుంచి చికాగోకు నేరుగా విమాన సర్వీసును ప్రారంభిస్తోంది
  • ఈ విషయమై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు
Air India: హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం..

Air India Launches A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియా నేటి (జనవరి 14) నుంచి హైదరాబాద్ నుంచి చికాగోకు నేరుగా విమాన సర్వీసును ప్రారంభిస్తోంది.

బోయింగ్ 777-200 విమానాన్ని ఈ డైరెక్ట్ సర్వీసు కోసం వినియోగించనున్నారు. గతంలో ఇక్కడి నుంచి విమానం బయలుదేరితే మధ్యలో హాల్ట్ స్టాప్ ఉంటుంది. వన్ స్టాప్ జర్నీ, టూ స్టాప్ జర్నీతో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కి అమెరికాకు చేరుకోవాల్సి వచ్చేంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమాన సర్వీసుతో వెయిటింగ్ టైమ్ లేకుండా నాన్ స్టాప్ జర్నీతో అమెరికాకు చేరుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన విమాన సర్వీసులు తెలంగాణ వాసులకు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Corona Vaccine: అన్ని రాష్ట్రాలు రెడీ.. తొలి దశలో 1.65 కోట్ల టీకాలు

 

 

ఈ విషయమై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. శంషాబాద్ నుంచి నేరుగా చికాగోకు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నందుకు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అధికారులను, ఎయిర్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ఇతర ఖండాలకు వెళ్లడంలో మరిన్ని డైరెక్ట్ విమాన సర్వీసులకు ఇది ఆరంభమని మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు 

 

హైదరాబాద్ నుంచి అమెరికాలోని పలు రాష్ట్రాలకు ఇతర విమానాశ్రయాల ద్వారా కనెక్టింగ్‌ ఫ్లైట్ సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే తమ ప్రాంతం నుంచి నేరుగా విమాన సర్వీసు నడపాలని తెలుగు రాష్ట్రాల వారు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగువారు, ఎన్‌ఆర్ఐల కోరిక నెరవేరనుంది.

Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News