BSNL 5GB Data Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే 5 జీబీ డైలీ డేటా!!
తాజాగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ను తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు భారీ లాభాలు పొందొచ్చు. రూ.599 ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజు 5 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
BSNL Rs 599 prepaid plan gives 5GB daily data for 84 days: ఒకప్పుడు టెలికామ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL).. ఇటీవలి కాలంలో తన ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది. బడా కంపెనీలు టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతో పోటీలో బీఎస్‌ఎన్‌ఎల్ వెనకబడింది. ముఖ్యంగా జియో తక్కువ ధరకే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లను ఆకర్షించింది. జియో దెబ్బకు బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఎయిర్‌టెల్, వీఐ (వోడాఫోన్, ఐడియా) లాంటి టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. అయితే తాజాగా పలు ఆఫర్లను తీసుకొస్తూ మళ్లీ రేసులో నిలవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ బంపర్ ఆఫర్ (BSNL Bumper Offer)తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్ (BSNL Rs 599 Plan)ను తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు భారీ లాభాలు పొందొచ్చు. రూ.599 ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజు 5 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా కూడా వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ప్రతీ రోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు. ఇక అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
Also Read: Vadivelu: స్టార్ కమెడియన్‌కు కరోనా.. ఒమిక్రాన్‌గా అనుమానం! ఆందోళనలో చిత్ర యూనిట్!!
రూ.599 ప్లాన్ (BSNL Rs 599 Plan)లో 5 జీబీ డైలీ డేటా, అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా ఉంది కాబట్టి.. ఈ ప్లాన్ కేవలం 28 రోజులో లేదా 56 రోజులు మాత్రమే ఉంటుందనుకుంటే మీరు పొరబడినట్టే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇన్ని ప్రయోజనాలు ఏ ఇతర టెలికామ్ సంస్థలు ఇవ్వడం లేదు. ప్రస్తుత టెలికామ్ సంస్థల ఆఫర్లలో ఇదే బెస్ట్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. ఈ ప్లాన్‌తో వర్క్ ఫ్రం హోం చేసుకునే వారు, రోజు అధిక జీబీ ఉపయోగించుకునే వారు పండగ చేసుకోనున్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఈ ప్లాన్ కలిసొచ్చే అవకాశం ఉంది. యూజర్లు పెరిగే అవకాశం కూడా ఉంది.
Also Read: Dance video : తండ్రీ కూతుర్ల డ్యాన్స్ అదుర్స్.. సింపుల్ స్టెప్స్‌తో చింపేశారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook