ECLGS scheme extended for MSMEs: కరోనాతో నష్టపోయిన చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా నష్టపోయిన వ్యాపార సంస్థలు ఇంకా కోలుకోనందున.. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి తరహా పరిశ్రమలు, వ్యాపారులకు రుణం అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2022 ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Emergency Credit Line Guarantee Scheme: నష్టాల ఊబిలో కూరుకుపోయి కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత కోసం ఎదురుచూస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి తరహా పరిశ్రమలు, వ్యాపారులకు ఇది కొంతమేరకు ఊరటనిచ్చే అంశం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 2023 మార్చి చివరి వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ కోసం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. అయితే, ఈ పథకం అమలులో భాగంగా కేంద్రం నిర్ధేశించుకున్న పరిమితి ముగిసినట్టయితే.. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ కింద గ్యారెంటీ కవర్‌ని మరో రూ. 50 వేల కోట్లు పెంచి రూ. 5 లక్షల కోట్లకు విస్తరించినట్టు కేంద్రం వెల్లడించింది.


Udyam, e-shram, NCS, Aseem portals - ఉద్యం, ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్, అసీం పోర్టల్స్: 
సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి తరహా పరిశ్రమలు, వ్యాపారుల సౌకర్యార్థం ఉద్యం, ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్, అసీం పోర్టల్స్‌ని ఒకదానితో మరొకటి అనుసంధానించడం ద్వారా అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) తెలిపారు. తద్వారా వివిధ విభాగాల సేవలు విస్తృతస్థాయిలో అందుబాటులోకి తీసుకురావొచ్చని కేంద్రం భావిస్తోంది.


Also read : Union Budget 2022 Live updates*: క్రిప్టో కరెన్సీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఫైల్, డిజిటల్ రూపీ, ఎల్ఐసి ఐపీఓ, ఈ-పాస్‌పోర్ట్ అంశాలపై కీలక ప్రకటన


Also read : AP PRC Issue: ఆన్‌లైన్‌లో ఏపీ ఉద్యోగుల కొత్త జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ రెడీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook