Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?
Budget 2023 Income Tax Calculations: ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 234D కింద ఒకవేళ టాక్స్ పేయర్స్ ఎవరైనా క్యాలిక్యులేషన్స్‌లో ఏదైనా తప్పిదం కారణంగా ఎక్కువ టాక్స్ చెల్లించి రిఫండ్ కోసం దాఖలు చేసినట్టయితే.. వారు చెల్లించిన ఆ ఎక్కువ మొత్తాన్ని కేంద్రం తిరిగి వారికి చెల్లిస్తుందనే విషయం చాలా మందికి తెలిసిన సంగతే.
Budget 2023 Income Tax Calculations: పన్ను చెల్లింపుదారులు ప్రతీ ఏడాది కేంద్రం విధించిన నిర్ణీత గడువు లోగా క్రమం తప్పకుండా తమ ఆదాయ వనరుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ తమ ఆదాయం వివరాలపై ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటి రిటర్న్స్ దాఖలు చేయని వారి నుంచి కేంద్రం ఆలస్య రుసుం కింద లేట్ పేమెంట్ ఫీజుతో పాటు వడ్డీ కూడా చార్జ్ చేస్తుంది.
అదే సమయంలో ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 234D కింద ఒకవేళ టాక్స్ పేయర్స్ ఎవరైనా క్యాలిక్యులేషన్స్‌లో ఏదైనా తప్పిదం కారణంగా ఎక్కువ టాక్స్ చెల్లించి రిఫండ్ కోసం దాఖలు చేసినట్టయితే.. వారు చెల్లించిన ఆ ఎక్కువ మొత్తాన్ని కేంద్రం తిరిగి వారికి చెల్లిస్తుందనే విషయం చాలా మందికి తెలిసిన సంగతే.
అయితే, ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే.. టాక్స్ పేయర్స్ కి రిఫండ్ పై ఇచ్చే వడ్డీ రేటు కంటే టాక్స్ పేయర్స్ నుంచి లేట్ పేమెంట్ ఫీజు కింద వసూలు చేసే మొత్తమే ఎక్కువ అనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. టాక్స్ పేయర్స్‌కి తిరిగి చెల్లించే రిఫండ్ కేంద్రం 6 శాతం వడ్డీ రేటు కలిపి చెల్లిస్తుండగా.. టాక్స్ పేయర్స్ ఆలస్యంగా ఐటి రిటర్న్స్ ఫైల్ చేసిన సందర్భంలో వారి నుంచి వసూలు చేసే పెనాల్టి 12 శాతం ఉంటుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రిఫండ్ పై ఇచ్చేది 6 శాతం కాగా.. ఆలస్యంగా ఐటి రిటర్న్స్ దాఖలు చేసే వారి నుంచి 12 శాతం వసూలు చేస్తోందన్న మాట. ఇంక భవిష్యత్‌లో మరిన్ని సవరనలు జరిగే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి : Budget 2023-24: మహిళలకు కొత్త స్కీమ్.. వృద్ధులకు శుభవార్త! బడ్జెట్‌లో మొదటిసారి ఓ కొత్త ప్యాకేజీ
ఇది కూడా చదవండి : Union Budget 2023 live updates: వేతన జీవులకు ఊరట, 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని సాగిన కేంద్ర బడ్జెట్
ఇది కూడా చదవండి : Budget 2023-24 Price Hike: కేంద్ర బడ్జెట్ 2023.. ధరలు తగ్గే, పెరిగే వస్తువులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook