Budget 2023, Amrit Kaal : అమృత్ కాల్ అంటే ఏంటి ? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం విన్న తరువాత చాలా మందికి కలిగిన సందేహం ఇది. బడ్జెట్ 2023 కూర్పు గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ .. " గత బడ్జెట్ ఆధారంగా 100 ఏళ్ల స్వతంత్ర్య భారతావనిని ఆవిష్కరించే విధంగా బడ్జెట్ 2023 ని రూపొందించడం జరిగింది " అని అభిప్రాయపడ్డారు. అదే క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అమృత్ కాల్ అనే పదాన్ని తరచుగా ఉపయోగించడం జరిగింది. దీంతో అసలు ఈ అమృత్ కాల్ అనే పదానికి అసలు అర్థం ఏంటి ? బడ్జెట్ ప్రసంగంలో ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారు అనే సందేహాలు కలిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేదాల ప్రకారం అమృత్ కాల్ అంటే అమృత కాలం అని అర్థం. ఒకరిని కష్టాల కడలి నుంచి గట్టెక్కించి అదృష్టం వరించేందుకు కారణమయ్యే శుభ ముహూర్తాన్ని అమృత కాలం అని అంటుంటారు. దీనినే అమృత ఘడియలు అని కూడా పిలవడం వినే ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక మంచి పని చేయడం కోసం వేచిచూసే శుభ ముహూర్తాన్నే అమృత్ కాల్ అని సంభోదిస్తారు. 


2021, 2022 తరహాలోనే ఈసారి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్‌లెస్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం బడ్జెట్ 2023 కి సంబంధించిన సమాచారాన్ని పిడిఎఫ్ ఫైల్స్ రూపంలో యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో యూనియన్ బడ్జెట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ మొత్తం వీక్షించడంతో పాటు బడ్జెట్‌ 2023 కి సంబంధించిన సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?


ఇది కూడా చదవండి : Honda Activa as EV: హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ చేసేశాడు.. మాడిఫికేషన్ ఖర్చు, మైలేజ్ రేంజ్ ఎంతో తెలుసా ?


ఇది కూడా చదవండి : Tata Nexon, Maruti Fronx: టాటా నెక్సాన్‌కి మారుతి ఫ్రాంక్స్ షాక్ ఇవ్వనుందా ? తక్కువ ధరలోనే SUV Car ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook