Rs 39,000 Smartphone for Rs 8000: 39000 రూపాయల విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం 8 వేల రూపాయలకే వస్తోందంటే నిజంగానే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది ముమ్మాటికి నిజం. రియల్‌మి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుంచి మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ రియల్‌మి GT Neo 3T అసలు ఖరీదు రూ. 39,000 కాగా.. ఆఫర్స్ అన్ని కలిపి ఇది ప్రస్తుతం కేవలం రూ. 8 వేలకే లభిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అద్భుతమైన 64MP రియర్ కెమెరా, టెంప్టింగ్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్స్ రియల్‌మి GT Neo 3T స్మార్ట్ ఫోన్‌కి భారీ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఈ క్రేజ్‌కి తోడు ఊహించని రీతిలో అతి తక్కువ ధరకే ఈ ఫోన్ లభిస్తుండటం మరింత టెంప్ట్ చేస్తోంది. 


ఇంతకీ ఆఫర్ ఏంటంటే..
రియల్‌మి GT Neo 3T ఫోన్ ఖరీదు రూ. 39 వేలు కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 26 శాతం డిస్కౌంట్‌పై కేవలం రూ. 28,499 కే లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుకోవడం కోసం కస్టమర్స్ అదనంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి GT Neo 3T స్మార్ట్ ఫోన్ కొనే వారికి అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.


మరి 8 వేల రూపాయలకే ఎలా లభిస్తుందంటే..
రియల్‌మి GT Neo 3T స్మార్ట్ ఫోన్‌పై రియల్‌మి కంపెనీ రూ. 20 వేల విలువైన ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. అంటే మీ స్మార్ట్ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఎంత మెరుగ్గా ఉంటే.. అంత ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందొచ్చన్నమాట. రూ. 20 వేల ఎక్స్‌చేంజ్ ఆఫర్‌పై ఫోన్ కొనుగోలు చేశారంటే.. కేవలం రూ. 8,499 కే ఈ ఫోన్ మీ సొంతం అవుతుంది. ఇదే కాకుండా బ్యాంక్స్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో లభించే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా సద్వినియోగం చేసుకుంటే.. ఈ ఫోన్ ఏకంగా కేవలం రూ. 8 వేలకే లభిస్తుంది. మొత్తానికి రూ. 39 వేల విలువైన ఫోన్ కేవలం రూ. 8 వేలకే లభిస్తోందంటే.. ఎవరికైనా ఔరా అని అనిపించకమానదు కదా !!


ఇది కూడా చదవండి : Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్


ఇది కూడా చదవండి : Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook