Car Insurance in Flood Damage: ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో తెలుగు రాష్ట్రాల్లో  వరదలు ముంచెత్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ, అలాగే తెలంగాణలోని ఖమ్మం పట్టణంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇతర నష్టాల బారిన పడి జనం ఇబ్బందుల పాలవుతున్నారు.  అయితే ఈ వరదల్లో కార్లు బైకులు నీళ్లలో పూర్తిగా మునిగిపోవడం,  వరద నీటిలో కొట్టుకుపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.  ఒకసారి కారు నీళ్లలో మునిగింది అంటే లక్షల్లో నష్టం సంభవించడం ఖాయం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారులోని ఇంజన్, గేర్ బాక్స్ వంటివి పూర్తిగా పాడైపోతాయి. వీటిని తిరిగి రిపేర్ చేయించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మీ కారు వరదల్లో నీట మునిగినప్పటికీ క్లెయిం చేసుకోవడం ద్వారా  మీరు భారీ నష్టం నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే వరదల్లో కూడా కవరేజ్ లభిస్తుందో తెలుసుకుందాం. మీరు సాధారణంగా తీసుకునే ఇన్సూరెన్స్ దొంగతనం, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కవరేజీ  ఇస్తాయి కానీ ప్రకృతి బీభత్సాలు  జరిగినప్పుడు కార్లు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వవు.  అలాంటి సమయంలో మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. 


కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీ:


సాధారణ కార్ ఇన్సూరెన్స్ బదులుగా కాంప్రిహెన్సిర్ కార్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా   ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు కూడా  కవరేజీ పొందవచ్చు.  అయితే సాధారణంగా వరదల్లో కారు కొట్టుకుపోయి ఇంజన్ పాడైనప్పుడు మీకు కవరేజ్ లభించకపోవచ్చు. కాంప్రిహెన్సివ్ బీమా పాలసీ ద్వారా వాతావరణం కారణంగా వాహనానికి జరిగిన నష్టాన్ని రిపేర్ చేయడానికి లేదా భర్తీ చేయడానికి మీకు కవర్ లభిస్తుంది. మీరు ఈ బీమా పాలసీని తీసుకున్నట్లయితే, వరదలు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటి వాటి వల్ల కలిగే అన్ని నష్టాలకు క్లెయిమ్ చేయవచ్చు. 


Also Read : FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు  


ఈ పాలసీ కింద కొన్ని యాడ్ ఆన్స్ చేసుకున్నట్లయితే,  మీకు కవరేజ్ లభించే అవకాశం ఉంది.  ముఖ్యంగా కొత్త కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఇంజన్ పాడైతే మీకు  మొత్తం కారు పైన ధర చెల్లిస్తారు. ఇది కొత్త కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్-ఆన్ కవర్‌లను తీసుకుంటే, వరద నీటి కారణంగా ఇంజిన్‌ నష్టపోయినప్పుడు సాధారణ పాలసీ కవర్  చేయదు. అందువల్ల, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ తీసుకున్నట్లయితే, మీరు కంపెనీ నుంచి పూర్తి క్లెయిమ్ పొందవచ్చు.


క్లెయిం చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే:


 ముందుగా మీ కారు డ్యామేజింగ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను తీసుకొని పెట్టుకోవాలి.  అలాగే కంపెనీ వారు అడిగిన అన్ని దరఖాస్తులను పూర్తి సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.  మీ కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిం పాలసీ  ప్రీమియంను ఎప్పటికప్పుడు చెల్లించాలి.  జరిగిన నష్టాన్ని నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయాలి.
 
Also Read :Car Expenditure:  కొత్త కారు కొంటున్నారా? ఒక నిమిషం ఆగి ఇవి తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.