Cardless withdrawal: ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశంలో ఆర్​బీఐ కీలక నిర్ణయాలు తీసకుంది. అందులో ముఖ్యమైంది ఏటీఎంలలో కార్ట్​లెస్ ట్రాన్సాక్షన్స్​. ఇంతకీ ఏమిటి ఈ కార్డ్​లెస్​ ట్రాన్సాక్షన్స్? ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంతో ఏం జరగనుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎంల వద్ద డబ్బులు విత్​డ్రా చేయాలంటే ఏటీఎం, డెబిట్​ కార్డు తప్పనిసరి. అయితే కొన్నాళ్ల నుంచి కార్డు లేకున్నా ఏటీఎంల ద్వారా డబ్బులు విత్​డ్రా చేసుకునేందుకు అనుమతినిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అయితే అన్ని బ్యాంకుల వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోలేకకపోతున్నారు. దీనితో ఆర్​బీఐ.. బ్యాంకు కస్టమర్లందరికీ కార్డ్​లెస్​ విత్​డ్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజా ఎంపీసీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది.


ఆర్​బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో అన్ని బ్యాంకుల వినియోగదారులు త్వరలో ఏటీఎం/డెబిట్​ కార్డులు లేకున్నా ఏటీఎంలు, బ్యాంకుల ద్వారా డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకు యూపీఐ (యూనైటెడ్​ పేమెంట్​ ఇంటర్​ఫేస్​)లో రిజిస్ట్రేషన్​ చేసుకుని ఉండటం తప్పనిసరి. ఈ సదుపాయంపై త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు వెల్లడించనుంది ఆర్​బీఐ.


మరిన్ని..


దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు ఆర్​బీఐ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్​ 1 నాటికి దేశంలో 606.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు తెలిపింది.


కొవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఆర్​బీఐ వెల్లడించింది. అయితే కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కుతున్నమని సంతోషించేలోపే.. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం వల్ల మళ్లీ ప్రతికూలతలు మొదలయ్యాయని వివరించింది.


Also read: OnePlus new TV: మార్కెట్లోకి వన్​ప్లస్ కొత్త స్మార్ట్​టీవీ- ధర, ఫీచర్ల ఇవే..


Also read: RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్​లెస్​ విత్​డ్రా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook