Lowest Safety Rating Cars: మీ కారు సేఫ్టీ రేటింగ్ ఎంత ? ఈ జాబితాలో మీ కారు ఉందేమో చూసుకోండి
Lowest Safety Rating Cars: కార్ల కొనుగోలు విషయంలో ఎన్నో అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఎవరైనా కారు కొనే ముందు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ , మైలేజ్ , సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, కంఫర్ట్ డ్రైవింగ్, తక్కువ ధర ఉండాలని ఎలాగైతే చూస్తారో.. అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఒక్కటే ఒక ఎత్తు. అంత ముఖ్యమైన అంశం ఏంటంటారా ?
Lowest Safety Rating Cars: గ్లోబల్ ఎన్సిఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్స్.. అవును.. ఏదైనా కారుని కొత్తగా లాంచ్ చేసేటప్పుడు, కొత్త వేరియంట్స్‌ని ప్రవేశపెట్టినప్పుడు వాటిని క్రాష్ టెస్టింగ్ చేసి జీరో నుండి 5 వరకు స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ రేటింగ్‌ని న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (NCAP) రేటింగ్స్ అంటారు. కారుకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు జరిగే డ్యామేజీ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది ? అది పెద్ద వారికి ఎంత సేఫ్టీ ఉంటుంది ? చిన్నపిల్లలకు ఎంత సేఫ్టీ ఉంటుంది అని వేర్వేరుగా రేటింగ్ ఇస్తారు.
అలా తక్కువ రేటింగ్ ఉన్న కొన్ని కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఈకో కారు క్రాష్ టెస్ట్ రేటింగ్స్ :
మారుతి సుజుకి ఈకో వాహనం స్టార్ రేటింగ్ విషయంలో పెద్ద వారికి అయితే 17 కి గాను కేవలం 1.13 తో 0 రేటింగ్ రాగా చిన్న పిల్లలకు 49 కి గాను 24.2 పాయింట్స్‌తో 2 స్టార్ రేటింగ్ లభించింది.
మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో కారు క్రాష్ టెస్ట్ రేటింగ్స్ :
మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో రేటింగ్స్ విషయానికొస్తే.. అడల్ట్స్‌కి 1 స్టార్ రేటింగ్ కాగా చిన్న పిల్లల సేఫ్టీలో దారుణంగా 0 రేటింగ్ లభించింది.
మారుతి సుజుకి వాగాన్ ఆర్ కారు క్రాష్ టెస్ట్ రేటింగ్స్ :
మారుతి సుజుకి వాగాన్ ఆర్ కారుని ఈ ఏడాది ఏప్రిల్లో క్రాష్ టెస్టింగ్ చేయగా.. అడల్ట్స్ సేఫ్టీకి 1 స్టార్ రేటింగ్ లభించగా.. చైల్డ్ సేఫ్టీకి 0 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. పాయింట్స్ పరంగా చూసుకుంటే.. అడల్ట్స్ రేటింగ్‌లో 34 పాయింట్స్‌కి గాను 19.69 పాయింట్స్ మాత్రమే లభించింది. చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ పరంగా చూసుకుంటే.. 49 పాయింట్స్‌కి గాను 3.4 పాయింట్స్ మాత్రమే లభించాయి.
మారుతి సుజుకి ఇగ్నైస్ కారు క్రాష్ టెస్ట్ రేటింగ్స్ :
మారుతి సుజుకి ఇగ్నైస్ కారు అడల్ట్ రేటింగ్స్‌లో 34 పాయింట్స్‌కి గాను 16.48 పాయింట్స్‌తో 1 రేటింగ్ మాత్రమే లభించగా.. చైల్డ్ సేఫ్టీ పరంగా 49 పాయింట్స్‌కి గాను 3.86 పాయింట్స్‌తో 0 రేటింగ్ మాత్రమే లభించింది.
రెనాల్ట్ క్విడ్ కారు క్రాష్ టెస్ట్ రేటింగ్స్ :
2018 లో జరిగిన ఆసియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం రేటింగ్స్‌లో అడల్ట్స్ సేఫ్టీలో 36 పాయింట్స్‌కి గాను 10.12 పాయింట్స్‌తో జీరో రేటింగ్ రాగా.. చైల్డ్ సేఫ్టీ రేటింగ్ పరంగా 49 పాయింట్స్‌కి గాను 14.56 పాయింట్స్‌తో 0 రేటింగ్ మాత్రమే వచ్చింది.