UPI Cash Deposit: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ఐసీడీ ఫెసిలిటీ లాంచ్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఆర్బీఐ ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి యూపీఐ యూజర్లు నగదును యూపీఐ అనుబంధిత ఏటీఎంలలో డిపాజిట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్ ఇది. ఇక నుంచి నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఐసీడీ అంటే ఇంటర్ పెరోబుల్ క్యాష్ డిపాజిట్ విధానం ద్వారా యూపీఐ ఉపయోగించి ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయవచ్చు. డెబిట్ కార్డు ఉపయోగాన్ని తగ్గించేందుకు ఈ కొత్త ఫీచర్ ప్రారంభించారు. ఆర్బీఐ యూపీఐ ఐసీడీ సౌకర్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. డెబిట్ కార్డు ఉపయోగించకుండానే ఏటీఎం సహాయంతో మీ ఎక్కౌంట్‌లో లేదా ఇతర బ్యాంక్ ఎక్కౌంట్లలో నగదు జమ చేయవచ్చు. ఈ ఏటీఎంలు క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్స్ రెండింటికీ పనిచేస్తాయి. 


యూపీఐ లావాదేవీలను సపోర్ట్ చేసే క్యాష్ డిపాజిట్ మెషీన్‌కు వెళ్లాలి. ఆ మిషన్‌పై యూపీఐ క్యాష్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కన్పిస్తుంది. మీ యూపీఐ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. డిపాజిట్ చేయాల్సిన నగదు వివరాలు స్క్రీన్‌పై కన్పిస్తాయి. అవి వెరిఫై చేసుకోవాలి. ఎందులో అయితే నగదు డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ యూపీఐ లింక్డ్ బ్యాంక్ ఎక్కౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదావీ పూర్తి చేయాలి. 


ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మాత్రమే ఈ సౌకర్యం అందిస్తున్నాయి. క్రమంగా త్వరలో అన్ని ఏటీఎంలలో యూపీఐ ఐసీడీ ఫెసిలిటీ రానుంది.


Also read: CBSE Scholorship 2024: సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయితే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ మీ కోసమే. ఇలా అప్లై చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి