CBSE Scholorship 2024: సాధారణంగా ఒకే ఒక ఆడ సంతానం కలిగిన వాళ్లు చాలా తక్కువ ఉంటారు. కానీ ఆలా ఉండే ఉంటే ఈ శుభవార్త మీ కోసమే. ప్రఖ్యాత సీబీఎస్ఈ అాలంటి అమ్మాయిలకు మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తోంది. ఈ సంవత్సరం మెరిట్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసేందుకు అక్టోబర్ 31 చివరి తేదీ. ఇతర అర్హతలేంటో తెలుసుకుందాం.
సీబీఎస్ఈ ప్రతి యేటా ఏకైక ఆడ సంతానంగా ఉన్నవారికి మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తోంది. పదవ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. ఏకైక ఆడ సంతానం అయి ఉండాలి. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదవాలి. అంటే ఈ స్కాలర్‌షిప్ కేవలం సీబీఎస్ఈ విద్యార్ధినులకు మాత్రమే లభిస్తుంది. పదో తరగతి వరకూ సీబీఎస్ఈలో చదివిన అమ్మాయిలకు పై చదువులకు ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది సీబీఎస్ఈ. 2024-25 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి ఇప్పుడు సీబీఎస్ఈ అనుబంధ కళాశాలల్లో 11, 12 తరగతులు చదువుతుండాలి. అంతేకాకుండా పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదు అంశాల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉంటే చాలు ఈ మెరిట్ స్కాలర్‌షిప్ మీదే. ఆ అమ్మాయి ట్యూషన్ ఫీజు కూడా నెలకు 1500 అంటే ఏడాదికి 18 వేలు మించకూడదు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించేందుకు సీబీఎస్ఈ బోర్డు ప్రతి యేటా ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తోంది. అదే విధంగా 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు అందించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. అక్టోబర్ 31 చివరి తేదీగా ఉంది.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అమ్మాయిలకు నెలకు 500 రూపాయలు అంటే ఏడాదికి 6 వేలు ఇంటర్ పూర్తయ్యేవరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. నవంబర్ 7 వరకు వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధినులు 11వ తరగతి పూర్తయ్యాక తిరిగి రెన్యువల్ చేయించుకోవాలి. మరెందుకు ఆలస్యం..ఏకైక సంతానంగా ఆడపిల్లలు ఉంటే వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసేందుకు ఈ లింక్ https://www.cbse.gov.in/cbsenew/scholar.html క్లిక్ చేయండి చాలు.
Also read: How to Eat Dates: డ్రై ఖర్జూరం వర్సెస్ వెట్ ఖర్జూరం ఏది ఆరోగ్యానికి మంచిది, ఎలా తినాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.