Mozilla Firefox: కేంద్ర ప్రభుత్వం మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లకు కీలక సూచన చేసింది. భారత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) ఒక ప్రకటనలో తెలిపింది. ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలున్నాయని అందులో పేర్కొంది, అవి బ్రౌజర్‌ సెక్యూరిటీని మార్చడమే కాకుండా యూజర్‌ డేటాను హ్యాకర్స్‌కు చేరవేస్తాయని హెచ్చరించింది. దీంతో యూజర్‌ అన్ని వివరాలు హ్యకర్లకు వెళ్లే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కావు దీనిని వాడే తప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైర్‌ఫాక్స్‌లో ఉన్న 98 వెర్షన్‌తో పాటు, SR 91.7 వెర్షన్‌, థండర్‌బర్డ్‌ 91.7 వెర్షన్ల కన్నా ముందు వెర్షన్‌ బ్రౌజర్లలో ఈ లోపాలున్నట్లు గుర్తించామని CERT-IN తెలిపింది. నకిలీ వెబ్‌ లింక్‌లు పంపి, యూజర్‌ వాటిపై క్లిక్‌ చేసిన వెంటనే బ్రౌజర్‌లోని రక్షణ వ్యవస్థను హ్యాకర్స్‌ యూజర్‌ డేటాను సేకరిస్తారని తెలిపింది. లింక్‌లను ఉపయోగిస్తే జాగ్రత్తగా యాప్‌కు సంబంధించిన లింక్‌లు ఉపయోగించాలన్నారు. వినియోగదారులు వెంటనే తమ ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ను ఫైర్‌ఫాక్స్‌ ఎస్‌ఆర్‌ 91.7, ఫైర్‌ఫాక్స్‌ 98, థండర్‌బర్డ్‌ 91.7 వెర్షన్లకు అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. 


ఇలా బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేయడం...


బ్రౌజర్‌ అప్‌డేట్‌ కోసం ఫైర్‌ఫాక్స్‌లోని కుడివైపు పైభాగంలో మూడు డాట్లపై క్లిక్ చేస్తే మెనూ ఉంటుంది.  క్లిక్ చేస్తే  హెల్ప్‌ ఆప్షన్‌ వస్తుంది. ఓపెన్ చేయగానే అబౌట్‌ ఫైర్‌ఫాక్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తరువాత ఫైర్‌ఫాక్స్‌ కొత్త వెర్షన్‌ అందుబాటులో ఉంటే బ్రౌజర్‌ దాన్ని ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేస్తుంది. అప్‌డేట్‌ అయినట్లుగా స్క్రీన్‌ మీద పాప్‌-అప్‌ విండోలో చూపిస్తుంది. 


Also Read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..


Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook