New FD Rates: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకుంది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జాబిత్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్​లు ముందు వరుసలో ఉన్నాయి.


సెంటరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఇలా..


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లలోపు ఫిక్స్​డ్​ డిపాజిట్ల (ఎఫ్​డీ)పై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.


బ్యాంక్ వెబ్​సైట్ ప్రకారం.. రూ.2 కోట్లలోపు ఎఫ్​డీలపై వివిధ.. కాల పరమితిని బట్టి కనీసం 2.75 శాతం, గరిష్ఠంగా 5.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు తెలిసింది.


  • 7-14 రోజుల కాలపరిమితితో కూడిన ఎఫ్​డీపై 2.75 శాతం వడ్డీ

  • 15-45 రోజుల కాలపరిమితి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు 2.90 శాతం

  • 46 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లకు వడ్డీ రేటు 3.25 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.

  • 91 రోజుల నుంచి 179 రోజుల గడువున్న ఎఫ్​డీకి 3.80 వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది.


యూకో బ్యాంక్​ ఎఫ్​  రైట్లు ఇలా..


యూకో బ్యాంక్ 1-3 ఏళ్ల వరకు గడువున్న.. రూ.2 కోట్ల లోపు ఫిక్స్​డ్​ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లను నిర్ణయించింది. సాధారణ ఖాతాదారులకు గరిష్ఠ వడ్డీ రేటును 5.10 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు మాత్రం గరిష్ఠ వడ్డీ రేటును 5.60 శాతంగా నిర్ణయించింది.


Also read: Jio Recharge Offers: జియో రూ.599 రీఛార్జ్ తో 100 GB డేటా.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం!


Also read: EPFO interest rate: 2021-22 ఈపీఎఫ్​ డిపాజిట్లకు త్వరలోనే వడ్డీ రేటు నిర్ణయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook