EPFO interest rate: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయాలు తీసుకునే ధర్మకర్తల బోర్టు (సీబీటీ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీ రేటును త్వరలోనే నిర్ణయించనుంది. వచ్చే నెలలో ధర్మకర్తల బోర్డు సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
'ఈపీఎఫ్ఓ ధర్మకర్తల సమావేశం వచ్చే నెలలో గువాహటీలో జరగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద'ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపెనందర్ యాదవ్ వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు.
కాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించినట్లుగా 8.5 శాతం వడ్డీ రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు భూపేందర్ యాదవ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయం ఆధారంగానే వడ్డీ రేటుపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరం ఇలా..
గత ఏడది మార్చిలో సమావేశమైన ఈపీఎఫ్ఓ ధర్మకర్తల బోర్డు సభ్యులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.50గా నిర్ణయించారు. ఇక 2021 అక్టోబర్‌లో ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది.
ఆర్థిక శాఖ ఆదేశాలతో గత ఏడాది ఆఖర్లో వడ్డీని చందాదారుల ఖాతాలలో జమ చేశారు.
2019-20 ఆర్థిక సంవత్సానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాన కనిష్టానికి తగ్గించింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే రేటును కొనసాగించింది. కరోనా నేపథ్యంలోన నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉండటం గమనార్హం.
2014-15 సమయంలో వడ్డీ రేటు అత్యధికంగా 8.8 శాతంగా ఉంది. గత 10 ఏళ్లలో అత్యల్పంగా 2011-12 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీ రేటును 8.25 శాతంగా ఉంచింది ధర్మకర్తల బోర్డు.
Also read: Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్!
Also read: Bank Fraud: దేశంలో భారీ బ్యాంక్ మోసం- రూ.22,842 కోట్ల కుచ్చు టోపి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook