New Pension Rules: మారిన పెన్షన్ నిబంధనలు, ఇక కుటుంబంలో వారికి కూడా పెన్షన్
New Pension Rules: పెన్షన్ పధకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. కొత్త పెన్షన్ నియమాల ప్రకారం మహిళా ఉద్యోగుల విషయంలో మార్పు కన్పిస్తుంది. పెన్షన్ నియమాలు, మార్పుల గురించి తెలుసుకుందాం..
New Pension Rules: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల్ నియమాల్లో వచ్చిన కీలకమైన మార్పుల్ని వెల్లడించింది. భర్త లేకుంటే మహిళా ఉద్యోగి పెన్షన్ పథకంలో తన పిల్లల్ని నామినేట్ చేసే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన మార్పుల్నికేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ ఉన్న నియమాల ప్రకారం పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు అందుతుంది. ఈ నిబంధనలోనే మార్పు వచ్చింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చిన కొత్త నిబంధన ప్రకారం భర్తతో లేకుండా ఒంటరిగా ఉంటున్న మహిళా ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఇలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్ సంరక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు. సీసీఎస్ పెన్షన్ నిబంధనలు 2021 రూల్ నెంబర్ 50లో సబ్ రూల్స్ 8, 9 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆ పెన్షన్ భార్య లేదా భర్తకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆ మహిళ పిల్లలు, ఇతర కుటుంబసభ్యులకు అర్హత ఉంటుంది. అది కూడా ఆ భార్య లేదా భర్త లేకపోయినా లేదా అనర్హత కలిగి ఉన్నా పిల్లలకు ఇచ్చేందుకు వీలుంటుంది.
ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళకు సంబంధించి విడాకుల కేసు కోర్టులో పెండిగులో ఉన్నప్పుడు లేదా ఆ మహిళ భర్తపై డొమెస్టిక్ వయోలెన్స్ కేసు వేసి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ మహిళ మరణిస్తే తన తదనంతరం తన పిల్లలకు పెన్షన్ ఇచ్చే విధంగా రాసుకోవచ్చు. భర్త చనిపోయిన మహిళ కూడా తన పిల్లలకు పెన్షన్ వర్తించేలా చేయవచ్చు. ఒకవేళ విడో మహిళ ఆ పిల్లలకు గార్డియన్ అయుంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆ విడో మహిళ ద్వారా పిల్లలకు వర్తింపచేయవచ్చు. పిల్లలు మైనర్ అయితే మెజార్టీ చేరుకున్న తరువాత ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హులౌతారు.
Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook