DA Hike News: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం 46 శాతం డీఏ అందుకుంటున్న ఉద్యోగులు ఇకపై 50 శాతం పొందనున్నారు. ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఏ 4 శాతం కచ్చితంగా పెరగనుంది. ఈసారి డీఏ పెంపుతో ఉద్యోగుల జీతంలో భారీ మార్పులు రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రతి యేటా రెండు సార్లు పెరుగుతుంటుంది. ప్రతి నెలా విడుదలయ్యే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఆరునెలలకోసారి డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీని ప్రకారం జనవరి 2024 నుంచి డీఏ పెరగాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డీఏ వస్తోంది. ఈసారి మరో 4 శాతం పెరిగి ఆ డీఏ 50 శాతానికి చేరుకోనుంది. డీఏ 50 శాతానికి చేరుకోగానే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. 


డీఏను కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు పెంచుతుంటుంది. ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచితే 46 శాతం నుంచి 50 శాతానికి చేరుకుంటుంది. ఇది అమలైతే అంటే డీఏ ఒకసారి 50 శాతానికి చేరుకోగానే ఉద్యోగుల జీతం ఒకేసారి 9000 పెరగనుంది. 2016 డియర్‌నెస్ అలవెన్స్ నిబంధనల ప్రకారం 7వ వేతన సంఘం అమలు ప్రారంభమైనప్పుడు డీఏను జీరో చేశారు. ఎందుకంటే డీఏ 50 శాతానికి చేరుకోగానే అప్పటి వరకూ ఉన్న డీఏ మొత్తాన్ని ఉద్యోగి కనీస వేతనంలో చేర్చుతుంటారు. అదే విధంగా ఈసారి కూడా డీఏ 50 శాతానికి చేరుకోగానే జీరో చేసి..ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలుపుతుంటారు. ఫలితంగా జీతం 50 శాతం పెరగనుంది. అంటే ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయలుంటే 50 శాతం డీఏ చేర్చడం ద్వారా 9 వేల రూపాయలు నేరుగా జీతంలో కలుస్తాయి. అంటే జనవరి నెల నుంచి ఉద్యోగుల కనీస వేతనం 27 వేలు కానుంది. ఆ తరువాత అక్కడ్నించి అంటే 27 వేలపై డీఏ లెక్కింపు మొదలౌతుంది.


జనవరి 2024 నుంచి పెరగాల్సిన డీఏపై ఈ నెలలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు డీఏ పెంపు నిర్ణయం రావచ్చని అంచనా. మొత్తం రెండు నెలల ఎరియర్లతో కలిపి పిబ్రవరి జీతం భారీగా పెరగవచ్చుని అంచనా.


Also read: Infinix Smart 8: 16జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5- ఎంపీ కెమేరా స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook