Interest Rates: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్. సుకన్య సమృద్ధి , పీపీఎఫ్ వంటి స్మాల్ సేవింగ్ పథకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. త్వరలో అధికారికంగా  ఈ ప్రకటన వెలువడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మాల్ సేవింగ్ పథకాల్లో పెట్టుబడి పెట్టినవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో శుభవార్త విన్పించనుంది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ వంటి స్మాల్ సేవింగ్ పథకాల్లో పెట్టుబడి పెట్టినవారికి ప్రయోజనం కలగనుంది. 


స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై ఇచ్చే వడ్డీ రేట్లపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుంటుంది. దీని ప్రకారం అక్టోబర్ నెలలో అంటే దీపావళి కంటే ముందే లక్షలాదిమంది పెట్టుబడిదారులకు కేంద్రం నుంచి శుభవార్త రావచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికంలో స్మాల్ సేవింగ్స్ పథకాలపై లభించే వడ్డీను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని తెలుస్తోంది. 


27 నెలలుగా మారని వడ్డీ రేటు


కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. కానీ కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ వడ్డీ రేట్లలో ఏ విధమైన మార్పు రాలేదు. గత 27 నెలల్నించి వడ్డీ రేటు స్థిరంగా కొనసాగుతోంది. 


చివరిసారిగా ఈ స్కీమ్స్ వడ్డీ రేట్లను 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మార్చారు. ప్రభుత్వ సెక్యూరిటీస్ పెరగడం వల్ల ఈసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఈ బాండ్స్ ఆధారంగా ప్రభుత్వం వడ్డీ ధరల్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.


ప్రస్తుతం ఏ స్కీమ్‌పై ఎంత వడ్డీ


1. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్                             7.1 శాతం వడ్డీ
2. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్                         6.8 శాతం వడ్డీ
3. సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్              7.4 శాతం వడ్డీ
4. సుకన్య సమృద్ధి యోజన                           7.6 శాతం వడ్డీ
5. ఐదేళ్ల ఆర్‌డి                                              5.8 శాతం వడ్డీ
6. వన్ ఇయర్ టర్మ్ డిపాజిట్ స్కీమ్             5.5 శాతం వడ్డీ
7. సేవింగ్ డిపాజిట్ వడ్డీ                                4 శాతం వడ్డీ
8. టర్మ్ డిపాజిట్ 1-5 ఏళ్లకు                          5.5-6.7 వడ్డీ


Also read: SIP Equity: ఎస్ఐపీ ఈక్విటీలో భారీ లాభాలు, పదివేల పెట్టుబడితో 12 లక్షల రిటర్న్స్, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook