2 More Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య జనవరి 15న ప్రారంభం కాగా, మరొకటి ఏప్రిల్ 9న సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రారంభమైంది. త్వరలో మరో రెండు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. సుఖవంతమైన, వేగవంతమైన జర్నీకు తోడు సౌకర్యాలు బాగుండటంతో డబ్బులకు వెనుకాడటం లేదు. సికింద్రాబ్-విశాఖపట్నం వందేభారత్ గత మూడు నెలలుగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ కూడా నిండుతోంది.


తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆక్సుపెన్సీ బాగుంటోంది. దాంతో సికింద్రాబాద్ నుంచి మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ముఖ్యంగా రానున్న 2-3 నెలల్లో సికింద్రాబాద్-బెంగళూరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలనే ఆలోచన ఉంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కాచిగూడ-బెంగళూరు మార్గంలో నడపనున్నారు. ప్రస్తుతం 12 గంటలున్న జర్నీ వందేభారత్ రాకతో 7 గంటలకు తగ్గిపోతుంది.


Also Read: 50 Lakh Insurance With Flight Tickets: డిస్కౌంట్‌పై ఫ్లైట్ టికెట్.. ప్లస్ 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉచితం


హైదరాబాద్-బెంగళూరు మధ్య ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్ సిటీ, సిలికాన్ వ్యాలీ రెండింటినీ కలుపుతూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 570 కిలోమీటర్లు ఉంది. వందేభారత్ ప్రారంభమైతే జర్నీ సమయం బాగా తగ్గిపోతుంది. ఇక మరో వందేభారత్ రైలుని సికింద్రాబాద్ నుంచి పూణేకు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 


Also Read: Unclaimed Deposits: ఆర్బీఐలో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎంతో తెలుసా, కుటుంబసభ్యులకు కూడా దక్కదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook