Unclaimed Deposits: ఆర్బీఐలో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎంతో తెలుసా, కుటుంబసభ్యులకు కూడా దక్కదా

Unclaimed Deposits: దేశంలో ఎన్నో ఎక్కౌంట్లు, డిపాజిట్లు క్లెయిమ్ కాకుండా వృధాగా మిగిలిపోతున్న పరిస్థితి. కష్టపడి సంపాదించిన డబ్బు ఆఖరికి కుటుంబసభ్యులకు కూడా కాకుండా పోతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అలా మూలిగి వృధాగా మారిన డబ్బెంతో తెలిస్తే నిర్గాంతపోతారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2023, 10:05 PM IST
  • వృధాగా మారిన 10 వేల మధ్యతరగతి ప్రజల డిపాజిట్లు
  • కుటుంబసభ్యులకు సైతం కాకుండా పోయిన 35 వేల కోట్లు
  • బ్యాంకుల ద్వంద్వ వైఖరే కారణమని విమర్శలు
Unclaimed Deposits: ఆర్బీఐలో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎంతో తెలుసా, కుటుంబసభ్యులకు కూడా దక్కదా

Unclaimed Deposits: కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకోవడం ప్రతి మధ్య తరగతివారికి అలవాటు. కొందరు తెలిసో తెలియకో ఎఫ్‌డి వివరాల్ని ఇంటి సభ్యులకు కూడా చెప్పరు. హఠాత్తుగా డిపాజిటర్ కాలం చేస్తే ఆ డబ్బుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు చాలాకాలంగా విన్పిస్తున్నాయి. ఈ తరహా ఎక్కౌంట్లు మధ్యలో నిలిచిపోతుంటాయి. వీటినే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పిలుస్తుంటారు. 

దేశంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కలలో కూడా ఊహించరు. కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన లెక్కల ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి ఆర్బీఐకు బదిలీ అయిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ అక్షరాలా 35 వేల కోట్లు. నమ్మలేకున్నారా..ముమ్మాటికీ నిజమిది. ఫిబ్రవరి 2023 నాటికి దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఆర్బీఐకు చేరిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం ఇది. ఈ 35 వేల కోట్లు 10.24 ఎక్కౌంట్లకు సంబంధించిన మొత్తం కావడం విశేషం.

ఇవి కూడా గత పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలంగా ఆపరేట్ కాకుండా ఆగిపోయిన డిపాజిట్లు. లోక్‌సభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరడ్ ఇచ్చిన నివేదిక ఇది. ఇందులో ఎస్బీఐ అగ్రస్థానంలో ఉంది. ఎస్బీఐ నుంచి 8,086 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,340 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3,904 కోట్లు ఉన్నాయి.

ఎందుకీ పరిస్థితి

ఆర్బీఐకు చేరిన ఈ మొత్తం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలదే. ప్రైవేటు బ్యాంకుల వివరాలు కలుపుకుంటే ఇంకా చాలా ఉంటుంది. చాలామంది డిపాజిట్ల గురించి కుటుంబసభ్యులకు చెప్పడం మర్చిపోతుంటారు. దాంతో ఎక్కౌంట్ హోల్డర్ హఠాత్తుగా మరణిస్తే ఆ డిపాజిట్ వివరాలు కుటుంబసభ్యులకు తెలియకపోవడంతో బ్యాంకుల్లో ఉండిపోయి..కొద్దికాలం తరువాత నిబంధనల ప్రకారం ఆర్బీఐకు బదిలీ అయిపోతుంటాయి. 

అందుకే బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రారంభించినప్పుడు కుటుంబసభ్యులకు పూర్తి వివరాలు ఇస్తే ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆర్బీఐకు బదిలీ అయిందంటే తిరిగి క్లెయిమ్ చేయడం తలకు మించిన భారమౌతుంది. ఓ విధంగా చెప్పాలంటే కష్టం కూడా. 

Also read: 50 Lakh Insurance With Flight Tickets: డిస్కౌంట్‌పై ఫ్లైట్ టికెట్.. ప్లస్ 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉచితం

అప్పుల వసూలులో ఉన్న ఆసక్తి డిపాజిట్ చెల్లింపులో ఉండదా

సాధారణంగా ఏ బ్యాంకులోనైనా రుణం తీసుకున్నాక ఆ వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఆ వ్యక్తి వారసుల్ని గుర్తించి మరీ రుణం వసూలు చేసుకుంటాయి. కానీ అదే డిపాజిటర్ మరణిస్తే మాత్రం ఆ వ్యక్తి వారసుల్ని గుర్తించి డిపాజిట్ మొత్తం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేరుగా ఆ డబ్బుల్ని ఆర్బీఐకు పంపించేస్తుంది. అంటే అప్పుల వసూలులో బ్యాంకులు చూపించే ఆసక్తి డిపాజిట్ చెల్లింపుల్లో చూపించదనేది వాస్తవం. ఈ పరిస్థితి మారాలనేది సగటు కస్టమర్ డిమాండ్. 

Also read: iPhone15: యాపిల్ ఐఫోన్ 15 ప్రో, మ్యాక్స్ డిజైన్ లీకైందిగా..ఎలా ఉందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News