ONGC: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ దేశంలో కొనసాగుతోంది. ముందుగా ఊహించనట్టుగానే ఇప్పుడు చమురు కంపెనీలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఓఎన్జీసీకు పెట్రోలియం శాఖ చేసిన సూచనలే దీనికి కారణం. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)స్థూలంగా చెప్పాలంటే ఓఎన్జీసీగా సుపరిచితమైన దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ క్షేత్రాల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లోని 60 శాతంపైగా ఉన్న వాటాలను నిర్వహణ అధికారాల్ని విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ ఓఎన్జీసీకు పెట్రోలియం సహజవాయవు శాఖ(Petroleum Ministry) సూచించింది. 


దేశీయంగా ఓఎన్జీసీకు చెందిన ముంబై హై, బసేన్‌ క్షేత్రాల్లో చమురు, గ్యాస్‌ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్‌జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద చిన్న చిన్న క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్‌జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్‌ భారాన్ని తగ్గించుకోవాలని పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్‌నాథ్ లేఖ రాశారు. ఏప్రిల్‌ 1న ఆయన రాసిన లేఖలో కూడా రత్న ఆర్‌–సిరీస్‌ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్‌ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్‌(KG Basin) గ్యాస్‌ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు. ఓఎన్జీసీ ఆధ్వర్యాల ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపధ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వామ్యులను ఆహ్వానించాలని కూడా ఆ లేఖలో సూచించారు. ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారముంది. అయితే పాతపడిన మౌళిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని సమస్యల కారణంగా ఉత్పత్తి పెంచడంలో సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే దేశీయంగా గ్యాస్, చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపిస్తే ఉత్పత్తి పెంచవచ్చని అమర్‌నాథ్ లేఖ రాశారు. ప్రస్తుతం పెట్రోలియం శాఖ(Petroleum Ministry) అదనపు కార్యదర్శిగా ఉన్న అమర్ నాథ్ వచ్చే ఏడాది ఓఎన్జీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రైవేటీకరణ(Privatisation of Ongc) దిశగా రాసిన రెండవ లేఖ ఇది. 


Also read: Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook