Nitin Gadkari on Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్‌లు, మూడు చక్రాల వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదేవిధంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో వినియోగదారుల ఆసక్తి కూడా పెరుగుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇది కాకుండా ఎంజీ మోటార్స్, కియా ఇండియా, హ్యుందాయ్ కూడా ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంలో జోరు కనబరుస్తున్నాయి. మెర్సిడెస్, బీఎండబ్యూ, జాగ్వార్ వంటి కంపెనీలు కూడా భారతదేశంలో తమ EVలను విక్రయించడం ప్రారంభించాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధర కారణంగా, చాలా మంది వినియోగదారులు కోరిక తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను షాక్‌కు గురిచేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై చౌకగా రుణాలు అందించడం వంటి సలహాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బ్యాంకులకు ఇవ్వలేదని గడ్కరీ పార్లమెంటులో చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు సలహా ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 


ప్రభుత్వం తన FAME పథకం కింద రాయితీలను అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. అయితే దీని తర్వాత మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ధర 10 లక్షలకు పైనే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు తక్కువ వడ్డీ రేట్లను డిమాండ్ చేయడానికి ఇదే కారణం. ఈ నేపథ్యంలో గడ్కరీ ప్రకటన చాలా మంది వినియోగదారులను నిరాశపరిచే అవకాశం ఉంది. 


ఇటీవల కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY24 కోసం FAME-2 పథకం కింద రూ.51.72 బిలియన్లను కేటాయించిని విషయం తెలిసిందే. ఇదికాకుండా మన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన పరికరాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నిర్ణయం దేశంలో ఈవీల ధరలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Also Read: Railway Track Stolen: వింత దొంగతనం.. 2 కిలోమీటర్ల రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు   


Also Read: ప్రధాని మోదీ అండతోనే అదానీకి అపార సంపద.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి: ఎమ్మెల్సీ కవిత   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి