Thieves Steal 2 KM Railway Track in Bihar: బీహార్‌లో విచిత్ర దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వంతెనలు, మొబైల్ టవర్లను దొంగలు ఎత్తుకెళ్లగా.. తాజాగా సరికొత్త వెరైటీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రెండు కిలోమీటర్ల వరకు రైలు పట్టాలను ఎత్తుకెళ్లారు. సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌ను చోరీ చేసి విక్రయించగా.. ఓ ఇంట్లో రైలు పట్టాల ముక్కలు చూసి రైల్వే అధికారులు షాక్‌కు గురయ్యారు. దొంగలకు సహకరించిన ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులను సస్పెండ్ చేసింది రైల్వే బోర్డు. రైల్వే డివిజన్‌కు చెందిన ఝంజర్‌పూర్ ఆర్పీఎఫ్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌తో పాటు మధుబని జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్ సస్పెండ్ అయ్యారు.
డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్‌కేఎ జానీ మాట్లాడుతూ.. లోహత్ షుగర్ మిల్లుకు సంబంధించి పాండౌల్ స్టేషన్ నుంచి రైల్వే లైన్ ఎత్తుకెళ్లిన విషయం జనవరి 24న తెలిసిందన్నారు. శాఖలవారీగా కమిటీలు వేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నిజమని తేలితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని పాండౌల్ స్టేషన్ నుంచి లోహత్ షుగర్ మిల్లు వరకు రైల్వే లైన్ ఉంది. అయితే ఇక్కడ చాలా కాలంగా చక్కెర మిల్లు మూతపడటంతో ఈ లైన్‌పై రైళ్లు తిరగడం లేదు. దీంతో ఆర్పీఎఫ్ సహకారంతో రైల్వే లైన్ ట్రాక్‌ను వేలం వేయకుండా స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. ఈ స్క్రాప్‌ను విక్రయిస్తూ పట్టబడగా.. వీరి వెనుక ఇద్దరు పోలీసుల హస్తం ఉందని చెబుతున్నారు.
సస్పెన్షన్‌కు గురైన ఝంఝార్‌పూర్ ఆర్పీఎఫ్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దంన్నర క్రితం శ్రీనివాస్ సమస్తీపూర్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ప్లాట్‌ఫాం నంబర్-7 సమీపంలోని బ్యారక్‌లో నివాసం ఉండేవాడు. ఈ సమయంలో ఆయన సమస్తిపూర్ స్టేషన్‌కు చెందిన అటాచ్ లిఫ్టర్‌తో సన్నిహితంగా ఉన్నాడు. ప్రయాణికుల నుంచి లాక్కున్న బ్రీఫ్‌కేసులను తన బ్యారక్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి అమ్ముకునేవాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో అప్పటి డివిజనల్ సెక్యూరిటీ అతనిని సస్పెండ్ చేశారు. తరువాత మళ్లీ ఉద్యోగంలో చేరి.. ప్రమోషన్ కూడా పొందాడు. ఇప్పుడు మరోసారి రైలు పట్టాలు ఎత్తుకెళ్లడంలో దొంగలకు సహకరించి వెలుగులోకి వచ్చాడు.
కాగా.. గతేడాది సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని పూర్నియా కోర్టు స్టేషన్‌లో రైలు ఇంజిన్‌లోని స్క్రాప్‌ను విక్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర దూబే సహా ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వీరేంద్ర దూబేను సర్వీస్ నుంచి తొలగించారు. తాజాగా ఏకంగా రైలు పట్టాలు ఎత్తుకెళ్లి విక్రయించడం సంచలనంగా మారింది.
Also Read: Telangana Budget Updates: రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. భారీగా నిధులు కేటాయింపు
Also Read: Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్ ఎంతంటే..? శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి