Maruti Suzuki Celerio Price and Mileage: పెరుగుతున్న పెట్రోల్ ధరల ఆర్థిక భారం భరించలేక వాహనాలు కొనుగోలు చేసే వారు ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఎక్కువ మైలేజ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఎలక్ట్రిక్ లేదా CNG కార్లే కదా... కానీ ఎలక్ట్రిక్ కార్ల ఖరీదు ఎక్కువగా ఉండటం, సీఎన్జీ కార్ల ధరలు ఎక్కువ ఉండటమే కాకుండా ఎక్కడపడితే అక్కడ ఇంధనం కూడా లభించకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. అందుకే పెట్రోల్ తోనే నడిచే వాహనాల్లో అధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ల జాబితాలో అన్నింటి కంటే ముందుండేది మారుతి సుజుకి సెలెరియో ఒకటి. మారుతి సుజుకి సెలెరియో కారు ధర నుండి ఫీచర్ల వరకు ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.
    
ధర మరియు వేరియంట్లు
మారుతి సుజుకి సెలెరియో కార్లు LXi, VXi, ZXi, ZXi+ అని మొత్తం నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. మారుతి సెలెరియో బేసిక్ వేరియంట్ ధర రూ. 5.33 లక్షల నుండి మొదలై హైఎండ్ వేరియంట్ కి రూ. 7.12 లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో కారు ఐదుగురు కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంది. రెనాల్ట్ క్విడ్, మారుతి వ్యాగన్ఆర్, టాటా టియాగో వంటి వాటితో పోటీపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంజిన్ ట్రాన్స్మిషన్:
మారుతి సుజుకి సెలెరియో కారు 1.0 లీటర్, K10C పెట్రోల్ ఇంజన్ 66bhp పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఏఎంటీ గేర్‌బాక్స్‌ కూడా ఉంది. సెలెరియో కారులో సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజన్ 56bhp, 82Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ పరంగా, ఇది పెట్రోల్ మోడ్‌లో 26.6kmpl మరియు CNGలో 35.6 km/kg అందిస్తుంది.


ఫీచర్స్
మారుతి సుజుకి సెలెరియో కారు డాష్‌బోర్డులో స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవింగ్ చేసే వారి ఎత్తుకు తగినట్టుగా హైట్ అడ్జస్ట్ చేసుకునే విధంగా డ్రైవర్ సీట్, ఇంజన్ స్టార్ట్, స్టాప్ బటన్, ఫ్రంట్ పవర్ విండోస్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, కారు పార్కింగ్ ఈజీ చేసేలా రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, మితిమీరిన వేగంతో వెళ్లకుండా స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ రిమైండర్, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ డీఫాగర్స్ కూడా ఉన్నాయి.


మారుతి సుజుకి సెలెరియా కారు డిజైన్
మారుతి సుజుకి సెలెరియో కారుకు ముందు భాగం, వెనుక భాగంలో బంపర్స్, స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద బ్లాక్ ఇన్సర్ట్‌తో ఫ్రంట్ బంపర్, ఫాగ్ లైట్స్, బ్లాకౌట్ బి పిల్లర్లు, 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో కారును డిజైన్ చేశారు.


ఇది కూడా చదవండి : Hyundai Creta Cars: 12 నుంచి 21 లక్షల విలువైన కారు రూ. 8 లక్షలకే.. వెంటనే కారు మీ చేతికి.. ఎగబడుతున్న జనం


ఇది కూడా చదవండి : Honda Cars Prices: హోండా కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్


ఇది కూడా చదవండి : Tata Safari: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK