Maruti Suzuki CNG Cars Mileage: మారుతి సుజుకి పెట్రోల్ కంటే CNG ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.. ఏకంగా 35 కి.మీ

Maruti Suzuki CNG Cars Mileage: మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారుతీ సుజుకీ కంపెనీ ఒక్కొక్కటిగా తమ పెట్రోల్ కార్లన్నింటినీ CNG వెర్షన్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే మారుతి సుజుకి బ్రెజ్జా SUV కారుని CNG వెర్షన్‌లో లాంచ్ చేసింది. దీంతో మారుతి సుజుకి నుంచి ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన CNG కార్ల సంఖ్య మొత్తం 14 కి చేరుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 04:10 PM IST
Maruti Suzuki CNG Cars Mileage: మారుతి సుజుకి పెట్రోల్ కంటే CNG ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.. ఏకంగా 35 కి.మీ

Maruti Suzuki CNG Cars Mileage: ఎవరైనా, ఏదైనా కారును కొనే ముందు చాలామంది ఆలోచించే విషయాల్లో ముందు వరుసలో ఉండే అంశం ఈ కారు మైలేజ్ ఎంత ఇస్తుంది అనేదే. ఎవరైనా సరే తమ కారు వీలైనంత అధిక మైలేజ్ ఇచ్చేదే అయ్యుండాలని కోరుకుంటారు. గతంలో చాలామంది మైలేజ్ కోసం డీజిల్ ఇంజన్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడేవారు కానీ ఇప్పుడు డీజిల్ ధరలు కూడా పెట్రోల్ ధరలకు సమానంగా పెరుగుతూ రావడంతో పాటు కాలుష్యం కారణంగా డీజిల్ వెర్షన్ కార్ మోడల్స్ తయారీ కూడా నిలిచిపోతుండటం, ఆ వాహనాలపై ఆంక్షలు పెరిగి సీఎన్జీ వాహనాలపై ఆంక్షలు తగ్గుతుండటం వంటి పరిస్థితుల్లో వాహనాల కొనుగోలుదారులు సీఎన్‌జీ కార్లు కొనడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక సీఎన్జీ కార్ల అమ్మకాల విషయానికొస్తే మారుతి సుజుకి కార్లదే హవా కొనసాగుతోంది.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారుతీ సుజుకీ కంపెనీ ఒక్కొక్కటిగా తమ పెట్రోల్ కార్లన్నింటినీ CNG వెర్షన్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే మారుతి సుజుకి బ్రెజ్జా SUV కారుని CNG వెర్షన్‌లో లాంచ్ చేసింది. దీంతో మారుతి సుజుకి నుంచి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన CNG కార్ల మొత్తం సంఖ్య 14 కి చేరుకుంది.  మారుతి సుజుకి కార్ల ధరను నిశితంగా పరిశీలిస్తే, CNG వెర్షన్ కార్ల ధరలు పెట్రోల్ వేరియంట్ ధరల కంటే సుమారు రూ. 90 వేల నుండి రూ. 95 వేల వరకు ఎక్కువ పలుకుతోంది. కాకపోతే ఆ ధరలకు తగినట్టుగానే అధిక మైలేజ్ కూడా లభిస్తోంది. 

మారుతి కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో సెలేరియో కారు ముందు వరుసలో ఉంటుంది. సెలేరియో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్ కార్లు రెండు మోడల్స్ కూడా అధిక మైలేజ్ ఇస్తాయి. మారుతి సుజుకి సెలెరియో CNG వెర్షన్ కేవలం VXI వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సెలెరియో VXI ధర రూ. 5.82 లక్షలు పలుకుతుండగా.. సీఎన్‌జి వేరియంట్ ధర రూ. 6.72 లక్షలు పలుకుతోంది. సీఎన్జీ వేరియంట్ కారు కిలోకి 35KM మైలేజ్ ఇస్తుంది. 

మారుతి సుజుకి పెట్రోల్, సీఎన్జీ కార్ల వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి..

మారుతి సుజుకి ఆల్టో 800 Lxi - పెట్రోల్ వేరియంట్ ధర రూ. 4.23 లక్షలు కాగా సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 5.13 లక్షలుగా ఉంది. ఈ రెండింటి మధ్య రూ. 90 వేలు తేడా ఉంది.

మారుతి ఆల్టో K10 Vxi - పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.04 లక్షలు కాగా సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 5.95 లక్షలు పలుకుతోంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్స్ మధ్య ధర 91 వేలుగా ఉంది.

మారుతి సుజుకి S-ప్రెస్సో LXi - పెట్రోల్ ఇంజన్ ధర రూ. 5 లక్షలు కాగా CNG వేరియంట్ ధర రూ. 5.90 లక్షలుగా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా రూ. 90 ఉంది.

మారుతీ వ్యాగన్ ఆర్ Lxi - పెట్రోల్ ఇంజన్ ధర రూ. 5.53 లక్షలు కాగా సిఎన్‌జి ధర రూ. 6.43 లక్షలుగా పలుకుతోంది. పెట్రోల్ ఇంజన్, సీఎన్జీ వేరియంట్స్ మధ్య రూ 90 వేలు ఉంది.

మారుతి సెలెరియో LXI వేరియంట్ పెట్రోల్ ధర రూ. 5.82 లక్షలు కాగా CNG వేరియంట్ ధర రూ. 6.72 లక్షలుగా ఉంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్స్ ధరల్లో 90 వేల రూపాయల తేడా ఉంది.

ఇది కూడా చదవండి : Best 7 Seater Cars: జస్ట్ రూ. 6.33 లక్షలకే 7 సీటర్ కారు.. మారుతితో పోలిస్తే 5 లక్షల తేడా

ఇది కూడా చదవండి : Top Sales & Best Bikes: ఒక్క నెలలో 2.8 లక్షల కంటే ఎక్కువ అమ్ముడైన బైక్.. ధర కూడా చాలా తక్కువ

ఇది కూడా చదవండి : Hyundai Cars on Discount: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News