Cheapest 7 Seater car: దేశంలో డెడ్ ఛీప్ 7 సీటర్ కారు ఇదే.. ధర కేవలం రూ.10 లక్షలే..!
Best Selling 7 Seater: దేశంలో బాగా అమ్ముడుపోయిన సెవెన్ సీటర్ కార్లలో మారుతీ ఎర్టిగా ఒకటి. రీసెంట్ రోజుల్లో వీటికి పోటీగా మరో కారు దూసుకొచ్చింది. అమ్మకాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ కారు ఏంటో తెలుసుకుందాం.
Best Selling 7 Seater: దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లలో మారుతి బాలెనో ఒకటి. ఇటీవల రోజుల్లో మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్ఈవీ కార్లే కాకుండా ఏడు సీటర్ వాహనాలు కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ డేస్ లో సెవెన్ సీటర్ కారు అయిన మారుతి ఎర్టిగా కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఆ కారు అమ్మకాలు భారీగా పడిపోయాయి. కార్ల అమ్మకాలలో ఎర్టిగా కంటే కియా కేరన్స్ స్వల్పంగా వెనుకబడి ఉంది.
వెనుకబడిన మారుతీ ఎర్టిగా
ఫిబ్రవరి నెలలో మొత్తం కార్ల విక్రయాలలో మారుతీ ఎర్టిగా 20వ స్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 6,472 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఏడాది కిందట అంటే ఫిబ్రవరి 2022లో 11,649 యూనిట్లు ఎర్టిగా అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే కార్ల అమ్మకాల్లో 44% తగ్గుదల నమోదైంది.
అమ్మకాల్లో 22% వృద్ధి సాధించిన కియా కేరన్స్
కార్ల విక్రయాలలో ఎర్టిగా కంటే కొంచెం దిగువన 21వ స్థానంలో కియా కేరన్స్ ఉంది. గత నెలలో 6,248 యూనిట్లను విక్రయించగా.. 2022 ఫిబ్రవరిలో 5,109 అమ్ముడయ్యాయి. ఈ ఏడాది కార్ల విక్రయాల్లో 22% వృద్ధి నమోదైంది.
కియా కేరెన్స్ ధర
కియా కేరెన్స్ ధర రూ. 10.20 లక్షల నుండి రూ. 18.45 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). ఇది ఐదు వేరియంట్ లో లభ్యమవుతుంది. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్. కియా కెయిర్న్స్ 6 మరియు 7-సీటర్ లలో అందుబాటులో ఉంది. త్వరలో ఐదు, ఎనిమిది సీటర్ల కారు అందుబాటులోకి రానుంది.
Also Read: Baleno Price: రూ. 1.5 లక్షలకే Maruti Baleno మీ సొంతం, వడ్డీ రేటు తక్కెవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి