Cheapest Electric Cars 2023: చీపెస్ట్ 3 ఎలక్ట్రిక్ కార్స్ ఇవే.. పూర్తి ఛార్జీతో 320 కిమీ ప్రయాణం!
Cheap Electric Cars in India and Hyderabad. మీరు చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నట్లయితే.. దేశంలోని అత్యంత సరసమైన మూడు ఎలక్ట్రిక్ కార్లు ఇవే.
Tata Tiago EV, Tata Tigor EV and Citroen C3 EV are Cheap Electric Cars in India: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న అతిపెద్ద కంపెనీగా 'టాటా మోటార్స్' కొనసాగుతోంది. ఇటీవలే ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' కూడా తన తొలి ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేసింది. ఇది టాటా టియోగా ఈవికి ప్రత్యర్థిగా మారింది. మీరు చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నట్లయితే.. దేశంలోని అత్యంత సరసమైన మూడు ఎలక్ట్రిక్ కార్ల వివరాలను మీకు అందిస్తున్నాము.
Tata Tiago EV:
దేశంలోని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియోగా అగ్రస్థానంలో ఉంది. ఈ కారు ధర రూ.8.69 లక్షల నుంచి మొదలై రూ.11.99 లక్షల వరకు ఉంటుంది. టాటా మోటార్స్ కంపెనీ ఈ కారులో 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 315 కిలోమీటర్ల వరకు వెళుతుంది.
Citroen eC3:
సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు ఇటీవలే భారత మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 12.43 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్‌లో 320 కిమీలు ప్రయాణం చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Tata Tigor EV:
టాటా టియాగో మాదిరే టాటా టిగోర్ కూడా పెట్రోల్ మరియు సిఎన్జీ కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్లో విక్రయించబడుతోంది. దీని ధర రూ.12.49 లక్షల నుంచి మొదలై రూ.13.75 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారులో 26kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు.
Also Read: Ravindra Jadeja: అరుదైన రికార్డు నెలకొల్పిన రవీంద్ర జడేజా.. రెండో భారత క్రికెటర్‌గా!
Also Read: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్.. కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.