Best Mahindra Cars 2023: రూ 5.50 లక్షలకే మహీంద్రా ఎక్స్‌యూవీ 500.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!
Second Hand Mahindra XUV500 Cars buy Rs 5.5 Lakhs in OLX. ఎక్స్‌యూవీ 500 కారు ఉత్పత్తిని మహీంద్రా నిలిపివేసింది. అయినప్పటికీ మీరు ఎక్స్‌యూవీ 500ని కొనుగోలు చేయవచ్చు.
Buy Used Mahindra XUV500 Cars only Rs 5 Lakhs in OLX: మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ 500 (Mahindra XUV500) శక్తివంతమైన వాహనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కంపెనీ తన ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) కారును విడుదల చేసినప్పుడు.. ఎక్స్‌యూవీ 500 కారు ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ మీరు ఎక్స్‌యూవీ 500ని కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ద్వారా మీరు ఈ కారుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
దేశంలో కొత్త కార్లు ఎంతగా అమ్ముడవుతున్నాయో.. పాత వాహనాలు కూడా అంతే రేంజ్‌లో అమ్ముడవుతున్నాయి. తక్కువ బడ్జెట్ మరియు నచ్చిన మోడల్‌ను కొనడానికి జనాలు సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంచుకుంటారు. సెకండ్ హ్యాండ్ కార్లను కొనడం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే కారు ఓనర్ రోడ్ టాక్స్ చెల్లించి ఉంటారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఓఎల్ఎక్స్‌లో రూ. 5.5 లక్షలకే మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కార్లను కొనేయొచ్చు.
2014 Mahindra Xuv500:
2014 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు ఇప్పటివరకు 58 వేల కిమీ తిరిగింది. ఈ కారు W6-2WD వేరియంట్ మరియు డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఓఎల్ఎక్స్‌లో ఈ కారు ధర రూ.5.50 లక్షలుగా ఉంది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 7లో ఈ కారు అమ్మకానికి ఉంది.
2014 Mahindra Xuv500:
2014 మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. నలుపు రంగులో ఉన్న ఈ కారు ఇప్పటివరకు 62000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు W8 2WD మోడల్.
2015 Mahindra Xuv500:
2015 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 సిల్వర్ కలర్ కారు ఇప్పటి వరకు 76 వేల కిమీ తిరిగింది. ఈ కారు W10 2WD వేరియంట్ మరియు డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.7.95 లక్షలు. ఈ కారు ఢిల్లీలోని పశ్చిమ్ విహార్లో అమ్మకానికి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.