Cheapest Recharge Plans Jio vs Airtel vs Vi : ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారులకు పలు రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ మూడు కంపెనీలు 200 రూపాయల కన్నా తక్కువ ధరలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఈ ప్లాన్స్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు ఉచిత డేటాను అందిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రిలయన్స్ జియో తక్కువ ధర ప్లాన్స్..
రిలయన్స్ జియో(Reliance Jio) యొక్క రూ .149 మరియు రూ. 199 రెండు రీఛార్జ్ ప్లాన్లు తెలుసుకోండి. 149 రూపాయల ప్లాన్ 24 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత కాల్‌ సహా మొత్తం 24GB డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ 1GB డేటాను ఉపయోగించవచ్చు. అదనంగా, ప్రతి రోజు 100 SMS మరియు జియో యాప్స్‌నకు ఫ్రి సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్


 


ఇది రూ.199 ప్లాన్.. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో జియో అందిస్తున్న అతి చౌకైన డేటా ప్లాన్ ఇది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. వినియోగదారులు మొత్తం 42 GB డేటాను ఉపయోగించవచ్చు. అదనంగా వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ మరియు ప్రతిరోజు ఉచితంగా 100 SMS పొందుతారు.


 


రూ.200 లోపు ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్..
ఎయిర్‌టెల్ 200 రూపాయలోపు మూడు గొప్ప ప్లాన్‌లను అందిస్తుంది. వీటి ధరలు రూ .149, రూ .179, రూ. 199గా ఉన్నాయి. రూ.149 ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీ. ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తుంది. Airtel నుంచి అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ మరియు 300 ఉచిత SMSలు చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ 30 రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.


Also Read: Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా


 


ఎయిర్‌టెల్ రూ .179 ప్లాన్‌.. దీని వ్యాలిడిటీ 28 రోజులు. 2 జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు అన్ని నెట్‌వర్క్‌లలో 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ 30 రోజులపాటు సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ .2 లక్షల జీవిత బీమాను అందిస్తోంది.


Airtel రూ.199 రీఛార్జ్ ప్లాన్‌లో 24 రోజులు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు 00 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లకు 30 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


 


వోడాఫోన్-ఐడియా (Vodafone-Idea) రీఛార్జ్ ప్లాన్స్.. 
రూ.200 రూపాయల కన్నా తక్కువ ధరలో వోడాఫోన్-ఐడియా అందిస్తున్న ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి. రూ.148, రూ.149 మరియు రూ.199 ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.148 రీఛార్జ్ ప్లాన్‌లో, ప్రతిరోజూ 1 జీబీ డేటా 18 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. 


వోడాఫోన్ ఐడియా రూ.149 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ, 3 జీబీ డేటా మాత్రమే అందిస్తుంది. అదనంగా, మీకు అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ మరియు వి-మూవీస్ మరియు టీవీకి యాక్సెస్ లభిస్తుంది. రూ. 199 రీఛార్జ్ ప్లాన్‌లో మీకు 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ప్రతిరోజూ 1GB డేటా పొందవచ్చు. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ మరియు వీ మూవీస్ మరియు టీవీకి యాక్సెస్ పొందవచ్చు.


Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook