Second Hand Toyota Fortuner Buy only Rs 26 Lakhs in Cars24: జపాన్ దేశానికి చెందిన 'టయోటా' కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ కస్టమర్ల కోసం టయోటా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కార్లు రిలీజ్ చేస్తూ మార్కెట్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా టయోటా కంపెనీకి చెందిన 'ఫార్చ్యూనర్'కు మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉంది. అయితే అధిక ధర కారణంగా చాలా మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫార్చ్యూనర్ ధర దాదాపు రూ. 32.5 లక్షల నుంచి మొదలవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్ తక్కువగా ఉండి, ఫార్చ్యూనర్ కారు కొనాలనుకుంటున్నారా?.. అయితే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో కార్స్ 24 మరియు మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వెబ్‌సైట్‌లో ఫార్చ్యూనర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే రోడ్డు పన్ను చెల్లించబడుతుంది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్‌లను చూద్దాం.


2018 Toyota Fortuner:
కార్స్24లో 2018 టయోటా ఫార్చ్యూనర్ 2.8 4x2 AT ఆటోమేటిక్ ధర రూ. 26,89,000లుగా ఉంది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. రీడింగ్ 86,567KM. ఈ కారు డీజిల్ ఇంజిన్‌తో నడవనుండగా.. నంబర్ ప్లేట్ DL-14తో ప్రారంభమవుతుంది. ఇది న్యూఢిల్లీలో అమ్మకానికి ఉంది.


2017 Toyota Fortuner:
మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వెబ్‌సైట్‌లో 2017 టయోటా ఫార్చ్యూనర్ 2.8 2WD AT ధర రూ. 30.5 లక్షలు. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉంది. రీడింగ్ 52365 కిమీలు కాగా.. ఇందులో డీజిల్ ఇంజన్ ఉంది. ఈ కారు ముంబైలో అమ్మకానికి అందుబాటులో ఉంది.


2017 Toyota Fortuner:
2017 టయోటా ఫార్చ్యూనర్ సిగ్మా 4 ధర మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వెబ్‌సైట్‌లో రూ.32 లక్షలుగా ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు 21631 కిమీ ప్రయాణించింది. ఇందులో డీజిల్ ఇంజన్ ఉండగా.. ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.


2012 Toyota Fortuner:
2012 టయోటా ఫార్చ్యూనర్ 3.0 AT 4X2 ధర రూ. 11.75 లక్షలుగా ఉంది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. రీడింగ్ 160000 కిమీ. ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉండగా.. ముంబైలో అమ్మకానికి అందుబాటులో ఉంది.


Also Read: Poco X5 Pro 5G: అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌.. నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే  


Also Read: Sreeleela Pics: చుడీదార్‌లో శ్రీలీల.. మరీ ఇంత అందమా అంటూ పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!


లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.