Cheapest SUV Cars in India, Best and Cheap Mahindra SUV Cars with  6 Seater: భారత దేశ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహీంద్రా ఎస్‌యూవీ కార్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహీంద్రా స్కార్పియో-N SUV ప్రస్తుతం దేశంలో అత్యధిక అమ్ముడుపోతున్న వాహనం. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 నుంచి ఎక్స్‌యూవీ 700 వరకు అన్ని వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. వీటి ధర భారీగా ఉండనుంది. అయితే మహీంద్రా చౌకైన ఎస్‌యూవీని కలిగి ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీని ధర కేవలం రూ. 6 లక్షలు మాత్రమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా చౌకైన ఎస్‌యూవీ మరేదో కాదు మహీంద్రా కేయూవీ 100 (Mahindra KUV100 Nxt). మహీంద్రాలో అత్యంత చౌకైన యూవీ కార్ ఇదే. ఈ కార్ ధరలు రూ.6.18 లక్షలతో ప్రారంభమై రూ.7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ధర మరియు డిజైన్ పరంగా ఈ కారు.. టాటా పంచ్‌తో పోటీపడుతుంది. అమ్మకాలు చాలా పరిమితం అయినప్పటికీ.. మీరు దీన్ని మైక్రో ఎస్‌యూవీగా మాత్రమే పరిగణించవచ్చు.


Mahindra KUV100 Nxt కార్ రెండు రకాల సీటింగ్ ఎంపికలలో వస్తుంది. దీనికి 5 సీటర్ (2+3) మరియు 6 సీటర్ (3+3) ఆప్షన్ ఉంది. దీని 6 సీట్ల వేరియంట్‌లో ముందు భాగంలో 3 మంది కూర్చునే సౌకర్యం ఉంది. ఈ కారులో 1198cc 3 సిలిండర్ BS6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 82bhp మరియు 114Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది. దీని డిజైన్ మైక్రో SUV లాగా ఉంటుంది. 


ఈ కారు అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, మస్కులర్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, మస్కులర్ బాడీ లైన్‌లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED DRLలతో డ్యూయల్-ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు, బెజెల్ సరౌండ్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు పవర్-ఫోల్డబుల్ ORVMలను కలిగి ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు USB కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Also Read: Virat Kohli Century: విరాట్ కోహ్లీ 45వ సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు సమం! 62 వన్డేల ముందుగానే   


Also Read: Hyundai Cars Discontinued: హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.