Hyundai Cars Discontinued: హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత!

Hyundai Verna, Hyundai Creta and Hyundai i20 cars Will Be Discontinued In 2023. ప్రముఖ మోటార్ సంస్థ 'హ్యుందాయ్'.. క్రెటా, వెర్నా మరియు i20లోని కొన్ని వేరియంట్‌లను తగ్గించనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 04:29 PM IST
  • హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
  • క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత
  • ఫిబ్రవరి 2023 నుంచి వెర్నా నిలిపివేత
Hyundai Cars Discontinued: హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత!

These 11 Hyundai Cars Will Be Discontinued In 2023: కార్ల కంపెనీలు తమ కార్ల వేరియంట్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవడం సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలను కూడా ఏప్రిల్ 2023 నుంచి అమలు కానున్నాయి. దాంతో కార్ కంపెనీలు అనేక డీజిల్ కార్ల విక్రయాన్ని కొనసాగించడం ఖరీదైనదిగా మారుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు 'హ్యుందాయ్' తన కార్ల వేరియంట్‌లను మార్చబోతోంది. 

రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ప్రకారం... భారత దేశంలో 2023లో చాలా వాహనాలు మూసివేయబడతాయి. ప్రముఖ మోటార్ సంస్థ 'హ్యుందాయ్' కూడా మూడు కార్ల వేరియంట్‌లను తగ్గించనుంది. క్రెటా, వెర్నా మరియు i20లోని కొన్ని వేరియంట్‌లను తగ్గించనుంది. ఈ మూడింటిలో మొత్తం 11 వేరియంట్‌లను హ్యుందాయ్ కంపెనీ నిలిపివేసింది. ఆ వేరియంట్‌లు ఏవో ఓసారి చూద్దాం. 

Hyundai Creta:
హ్యుందాయ్ క్రెటా యొక్క 1.4 టర్బో GDI DCT S+ మరియు 1.5 iMT S వేరియంట్‌లను కంపెనీ నిలిపివేస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు 2023 జనవరి నుంచి నిలిపివేయబడతాయి. క్రెటా మూడు ఇంజన్ ఎంపికలతో 1.5-లీటర్ MPi పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్లతో వస్తుంది.

Hyundai i20:
i20 యొక్క నిలిపివేయబడిన వేరియంట్‌ల జాబితాలో i20 Asta(O) 1.5 CRDi MT, మాగ్నా 1.5 CRDi MT మరియు స్పోర్ట్జ్ 1.5 CRDi MT ఉన్నాయి. ఇవి 2023  జనవరి 23 నుంచి మూసివేయబడతాయి. అదనంగా i20 Sportz 1.0 Turbo GDi iMT యొక్క పరిమిత యూనిట్లు అందుబాటులో ఉంటాయి. స్టాక్ అయిపోయిన వెంటనే ఈ వేరియంట్ కూడా నిలిపివేయబడుతుంది. 

Hyundai Verna:
హ్యుందాయ్ వెర్నా యొక్క 1.0 టర్బో GDI DCT SX(O) వేరియంట్ జనవరి 23 నుంచి నిలిపివేయబడుతుంది. ఇది కాకుండా 1.5 లీటర్ డీజిల్‌తో MT S +, MT SX మరియు 1.5 లీటర్ పెట్రోల్‌తో MT S +, MT SX వేరియంట్‌లు ఫిబ్రవరి 2023 నుంచి నిలిపివేయబడతాయి.

Also Read: Tata Cars Offers 2023: టాటా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా 75,000 తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్ 

Also Read: Grah Gochar 2023: 48 గంటల తర్వాత సంచరించనున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారికి బంగారు రోజులు మొదలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News