Jio vs VI vs Airtel vs BSNL: మీరు కొత్తగా ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా. ఏ నెట్‌వర్క్ మంచిది, ఎందులో మంచి ప్యాకేజీలున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. మీ కోసం ఆ వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో చాలా టెలీకాం కంపెనీలున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలలో ఏది ఎంచుకోవాలో తెలియని పరిస్థితి. ఏ కంపెనీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో అర్ధం కాదు. అందుకే మీ కోసం వివిధ కంపెనీలు అందిస్తున్న 5 వందల రూపాయల్లోపు ప్లాన్స్ వివరాలు మీకు అందిస్తున్నాం.  ఈ ప్లాన్స్ చదివితే ఏది ఎంచుకోవాలో మీకే తెలుస్తుంది. 


5 వందల్లోపు బెస్ట్ ప్లాన్స్


ఎయిర్‌టెల్ 479 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుంది 56 రోజుల వరకూ. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ సౌకర్యముంటుంది. అంతేకాకుండా రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇవి కాకుండా నెలరోజుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఉచితంగా లభిస్తుంది. మరోవైపు అపోలో మెడిసిన్స్‌లో మూడు నెలల సబ్‌స్క్పిప్షన్ లభిస్తుంది. షా అకాడమీ ద్వారా  ఉచితంగా ఆన్‌లైన్ స్కిల్ కోర్సులు నేర్చుకోవచ్చు. ఫాస్టాగ్‌పై వంద రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వింక్ మ్యూజిక్ సౌలభ్యంతో పాటు హెలో ట్యూన్స్ ఉచితంగా పొందవచ్చు.


వోడాపోన్ 479 రూపాయల ప్లాన్


ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో 56 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ ఏ విధమైన అదనపు ఖర్చు లేకుండా..ఉచితంగా స్ట్రీమింగ్, షేరింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీకెండ్‌లో డేటా రోల్ ఓవర్ చేసుకోవచ్చు. మరోవైపు వోడాఫోన్ మూవీస్, టీవీ ఎంజాయ్ చేయవచ్చు. 


జియో 479 రూపాయల ప్లాన్


ఇందులో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. జియో టీవీ ఉచితం.


బీఎస్ఎన్ఎల్ 347 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్ నెల రోజుల వ్యాలిడీటీ, రోజుకు 2 జీబీ డేటాతో వస్తోంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ముంబై, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్ సహా అపరిమితమైన వాయిస్ కాల్స్ సౌకర్యముంది. 


Also read: POCO M3 Pro 5G: అద్భుతమైన 18 వేల రూపాయల పోకో స్మార్ట్‌ఫోన్, కేవలం 630 రూపాయలకే, ఆఫర్ ఇంకో మూడు రోజులే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook